కాంగ్రెస్ జాతీయ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాను పోలీసులు అడ్డుకున్నారు. పౌరసత్వ ఆందోళనల్లో నష్టానికి గురైన ఎస్సార్ దారపురి బంధువులను కలిసేందుకు వెళ్తున్న ఆమెను పోలీసులు అడ్డుకునే క్రమంలో గొంతుపట్టుకున్నారంటూ ఆరోపించారు. సీఏఏ, ఎన్నాఆర్సీలపై డిసెంబరు 19నుంచి ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే పోలీసులు పలు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్కడికి చేరుకున్న ప్రియాంకను రెండు పాయింట్ల దగ్గర ఆపేశారు. సాయంత్రం 5గంటల 30నిమిషాలకు ఈ ఘటన జరిగింది. వారితో వాదనకు దిగడంతో పాలిటెక్నిక్ స్క్వేర్ లోకి అనుమతి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. సూచనలు ఉల్లంఘించి వెళ్లకూడదని పోలీసులు వారించారు.
#WATCH: Congress’ Priyanka Gandhi Vadra says,”UP police stopped me while I was going to meet family of Darapuri ji. A policewoman strangulated&manhandled me. They surrounded me while I was going on a party worker’s two-wheeler,after which I walked to reach there.” pic.twitter.com/hKNx0dw67k
— ANI UP (@ANINewsUP) December 28, 2019
దీంతో కారు దిగి పాలిటెక్నిక్ స్క్వేర్‌కు 2.5కిలోమీటర్ల దూరంలోనే దారాపురి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. తనను అడ్డుకునే క్రమంలో పోలీసులు చూపించిన వైఖరి సబబు కాదని అంటూనే ‘ఈ పోలీసులేం చేస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉన్నతాధికారుల చేతిలోనే ఉంది. ప్రజలను కలవడానికి కూడా అనుమతించడం లేదు’ అని వాపోయారు.