ల్యాండ్ డీలింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొటంటున్న కాంగ్రెస్ పార్టీ ఉత్తర ప్రదేశ్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ భర్త రోబర్ట్ వాద్రాను స్వయంగా తానే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఆఫీసు ముందు దించి వెళ్లింది. ఉత్తర ప్రదేశ్ జనరల్ సెక్రటరీగా ప్రియాంక గాంధీని నియమించడానికి ముందురోజే వాద్రాపై ఆరోపణలు వచ్చాయి. దీంతో లండన్‌లో ఉన్న అతనిని భారత్‌కు వచ్చిన వెంటనే కలవమని ఈడీ అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 6 బుధవారం ప్రియాకం గాంధీ స్వయంగా కారులో భర్తను ఈడీ ఆఫీసు ముంగిట వదలివెళ్లింది
వాద్రా న్యాయవాదులతో కలిసి ఈడీ అధికారులను కలిశారు. వాద్రా, కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీలు క్రిమినల్ కేసు ఆరోపణలు ఎదుర్కొవడం ఇదే తొలిసారి. గతంలో వాద్రాపై వచ్చిన ఆరోపణలను రాజకీయ కోణంలో కొట్టిపరేశారు. కాగా, ఈ సారి లండన్‌లో 1.9 మిలియన్ పౌండ్ల ఆస్తితో పాటు, మరి కొన్ని చోటు ఉన్న ఆస్తుల వివరాల పట్ల, వాద్రా పేరిట ఉన్న పలు మనీ ల్యాండరింగ్ విషయాల గురించి ఈడీ వివరణ కోరింది.
ఇదే విషయంపై గతేడాది డిసెంబరులో దాడులు జరిపిన ఈడీ వాద్రా ఉద్యోగి మనోజ్ అరోరాను విచారించింది. ఈ మేర వాద్రా ఫిబ్రవరి 12న ఈడీ ముందు వివరణ ఇచ్చిన అనంతరం రాజస్థాన్ హైకోర్టులో హాజరుకావాల్సి ఉంది.