ED: నగదు అక్రమ చలామణి.. సీఎం కూతురిపై కేసు పెట్టిన ఈడీ

కొచ్చిన్ మినరల్స్, రూటిల్ లిమిటెడ్ ప్రైవేట్ కంపెనీ 2017-2018 మధ్య వీణాకు చెందిన ఎక్సాలాజిక్..

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూతురు వీణా విజయన్, ఆమె ఐటీ సంస్థపై నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. వీణా సంస్థకు ఓ ఖనిజాల సంస్థ అక్రమంగా చెల్లింపులు చేసిందన్న ఆరోపణలపై ఈ కేసు నమోదు చేసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.

సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని ఈడీ వర్గాలు చెప్పాయి. ఈ విషయంపై కేంద్రం దర్యాప్తు చేయాలని ఆ ఆఫీస్ కోరింది. కొచ్చిన్ మినరల్స్, రూటిల్ లిమిటెడ్ ప్రైవేట్ కంపెనీ 2017-2018 మధ్య వీణాకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్‌కి రూ.1.72 కోట్ల చెల్లింపులు చేసిందని ఆరోపణలు ఉన్నాయి.

ఎక్సాలాజిక్ సొల్యూషన్స్‌ తమకు ఎలాంటి సర్వీసులూ అందించనప్పటికీ కొచ్చిన్ మినరల్స్, రూటిల్ లిమిటెడ్ ప్రైవేట్ కంపెనీ ప్రతి నెల చెల్లింపులు చేసిందని ఆరోపణలు వచ్చాయి. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ విచారణపై ఎక్సాలాజిక్ సొల్యూషన్స్‌ ఇప్పటికే కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. అయితే, ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.

Also Read : రంగంలోకి బీజేపీ పెద్దలు.. టికెట్లు రాని నేతలకు బుజ్జగింపులు

ట్రెండింగ్ వార్తలు