Leopard
Leopard Death : ఉత్తరప్రదేశ్ సఫారీ పార్కులో చిరుతపులి మృతి ఘటనపై అటవీశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. బిజ్నోర్ జిల్లా నగినా రేంజ్ నుంచి రక్షించిన చిరుతపులి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. చిరుతపులి కళేబరాన్ని బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐవిఆర్‌ఐ)కి తరలించామని సఫారీ పార్క్ డైరెక్టర్ దీక్షా భండారి తెలిపారు. (Probe Ordered Into Leopard’s Death)
Odisha : ఒడిశాలో పిడుగుపాటుకు 10 మంది మృతి
బిజ్నోర్‌లోని నగినా పరిధిలోని దయాల్‌పూర్ గ్రామం నుంచి చిరుతపులిని రక్షించి సఫారీ పార్కుకు తీసుకువచ్చారు. (UP Safari Park) చిరుత పులి ముఖం,శరీరంపై గాయాల గుర్తులతో ఆగస్టు 26 రాత్రి ఇటావా సఫారీ పార్క్‌కు తీసుకువచ్చినట్లు సఫారీ పార్క్ డైరెక్టర్ దీక్షా భండారి తెలిపారు. ఈ చిరుతకు సఫారీ డాక్టర్‌తో పాటు కాన్పూర్, జైపూర్ జంతుప్రదర్శనశాలల నిపుణులు చికిత్స అందించారు.
IND vs PAK : వరుణుడి ఆట.. మ్యాచ్ రద్దు.. భారత్, పాకిస్తాన్‌కు చెరో పాయింట్
అయితే చిరుతపులికి అయిన అంతర్గత గాయాలను గుర్తించలేక పోవడంతో అది నోటి నుంచి నురుగు వచ్చి మూర్చతో మరణించింది. చిరుతపులి మృతికి గల కారణాలపై శాఖాపరమైన విచారణకు ఆదేశించామని, బాధ్యులందరిపై చర్యలు తీసుకుంటామని భండారి తెలిపారు.