JNU అధ్యక్షురాలు ఐషే ఘోష్‌పై తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

  • Publish Date - January 18, 2020 / 05:36 AM IST

జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ ఐషే ఘోష్‌ గురించి తల్లి సర్మిస్తా ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు వెల్లడించారు. జేఎన్‌యూలో విద్యార్థుల ఫీజుల పెంపు, పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. 2020, జనవరి 05వ తేదీన కొందరు ముసుగు ధరించి..జేఎన్‌యూలో విధ్వంసానికి పాల్పడడం..ఇందులో ఐషే తీవ్రంగా గాయపడడం సంచలనం సృష్టించింది. తలకు రక్తం కారుతుండడం..చేయి విరిగిన దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. 
ఘటనకు సంబంధించి, ఇతరత్రా విషయాలపై సర్మిస్తా ఘోష్ స్పందించారు. 

క్యాంపస్ రాజకీయాల్లో ఐషే చురుగ్గా పాల్గొనడం తనను ఆశ్చర్యపరిచిందని, చిన్నతనంలో సిగ్గు పడుతూ..విధేయతగా తన కూతురు ఉండేదన్నారు. చిన్నతనంలో తండ్రి రాజకీయాల్లో ఉండడంతో ఆమె దానిపై అవగాహన కలిగి ఉండేదన్నారు. అయితే…ఇక్కడ ఐషే రాజకీయాల్లోకి వస్తుందని తాను మాత్రం ఊహించలేదన్నారు. చిన్నతనంలో పెయిటింగ్ అంటే చాలా ఇష్టంగా ఉండేదని, పలు చిత్రాలు కూడా గీసిందన్నారు.

స్వగ్రామంలో అనేక బహుమతులు, ప్రశంసలు లభించాయని తెలిపారు. విద్యార్థుల సమస్యలపై మరోసారి గొంతు పెంచినందుకు గర్వంగా ఉందన్నారు. కానీ ఆమె భద్రతపై ఆందోళనగా ఉందన్నారు. స్టూడెంట్స్‌కు వ్యతిరేకంగా జరిగే ప్రతిదానిపై గళం వినిపించాలని అనుకుంటుందని, సమస్యలతో బాధ పడడం చూస్తూ ఊరుకోవడం ఆమెకు ఇష్టం లేదని తెలిపారు. 

వెస్ట్ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఐషే తల్లిదండ్రులతో నివాసం ఉండేది. తండ్రి దేబాషిస్ ఘోష్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా కార్మిక విభాగమైన CITUతో సంబంధాలు కలిగి ఉన్నారు. ఢిల్లీలోని దౌలత్ రామ్ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో బాచిలర్ చేశారు. అండర్ గ్రాడ్యుయేట్ ఉన్న సమయంలో క్యాంపస్ రాజకీయాల్లోకి మెళ్లిగా ప్రవేశేశించారు. సీపీఎం విద్యార్థి విభాగమైన SFIలో చేరారు ఐషే. JNUలో ఎన్ రోలింగ్ చేసిన తర్వాత..రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2019 జేఎన్‌యూ అధ్యక్షురాలిగా ఎన్నిక కాకముందు..కౌన్సిలర్‌గా రెండు సార్లు ఎన్నికయ్యారు. 

సీనియర్ విద్యార్థి అయినా..చిరునవ్వుతో అందరినీ పలకరించేదని, ఎక్కువగా క్యాంపస్‌లోనే ఉంటుందని..అందరితో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండేదని పలువురు వెల్లడించారు. తొందరగా కలిసిపోయేదని, తాను కాలేజీలో చేరిన సమయంలో కోర్సులో కొన్ని అర్థమయ్యేది కాదని..ఈ సందర్భంగా ఐషేని సంప్రదించినప్పుడు..చాలా సహకరించి..వివరంగా, అర్థమయ్యే విధంగా చెప్పేదని ఓ స్టూడెంట్ వ్యాఖ్యానించారు. 

జేఎన్‌యూలో జరిగిన దాడిలో ఐషే తీవ్రంగా గాయపడ్డారు. తలకు గాయంకాగా..చేయి విరిగిపోయింది. 48 గంటల్లోనే చికిత్స చేయించుకుని తిరిగి క్యాంపస్‌లో అడుగు పెట్టారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొని గళమెత్తారు. కానీ..జేఎన్‌యూలో హింస జరిగిన దానిలో ఆమె ఒకరని పోలీసులు వెల్లడించారు. ఐషే తల్లిదండ్రులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. వ్యతిరేకంగా గొంతుపెంచినందుకు గర్విస్తున్నారు. అదే సమయంలో ఆమె భద్రతపై భయపడుతున్నారు. 

Read More : మంజూరి చతుర్వేది నృత్యాన్ని మధ్యలో ఆపేశారు