సోనియా బర్త్ డే : కిలో ఉల్లిపాయలు ఫ్రీ

  • Published By: chvmurthy ,Published On : December 9, 2019 / 11:32 AM IST
సోనియా బర్త్ డే : కిలో ఉల్లిపాయలు ఫ్రీ

Updated On : December 9, 2019 / 11:32 AM IST

దేశంలో ఉల్లిపాయల కోసం ప్రజలు వందలకు వందలు ఖర్చు పెడుతుంటే ఆ రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రం కిలో ఉల్లిపాయలు   ఫ్రీ గిఫ్టుగా వచ్చాయి. అది ఎక్కడంటారా….. పుదుచ్చేరిలో

యూపీఏ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా  కాంగ్రెస్ కార్యకర్తలు ఈ గిఫ్ట్ అందుకున్నారు.  డిసెంబర్9 సోనియా గాంధీ పుట్టినరోజు కానుకగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి ఒక్కో కాంగ్రెస్ కార్యకర్తకు కిలో ఉల్లిపాయలు బహుమతిగా అందచేశారు.