Pulwama Attack Affect : జేషే మహ్మద్‌ను బ్లాక్ లిస్టులో పెట్టండి

  • Publish Date - February 28, 2019 / 03:55 AM IST

ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరు సత్ఫలితాలను ఇస్తోంది. అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతోంది. పాక్ ఏకాకి అయిపోతోంది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకుంటున్న చర్యలకు పలు దేశాలు మద్దతు పలుకుతున్నాయి. పాక్‌కు అమెరికా గట్టి వార్నింగ్ చేసింది. ఉగ్రవాదాన్ని అణిచివేయాలని, కవ్వింపు చర్యలు పాల్పడవద్దని అమెరికా హితవు పలికింది. తాజాగా ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ని బ్లాక్ లిస్టులో పెట్టాలని ప్రతిపాదన చేశాయి. 

ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు కొత్త ప్రతిపాదన చేశాయి. ఈమేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని కోరాయి. ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్‌పై నిషేధం విధించాలని మూడు సభ్య దేశాలు కోరాయి. 15 సభ్య దేశాల మండలిలో కీలక పాత్ర పోషిస్తున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు భారత్ – పాక్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితిపై స్పందించాయి. మసూద్ అజర్‌ను నిషేధించి, అతడి ఆస్తులను ఫ్రీజ్ చేయాలని ఐరాస భద్రతా మండలిని కోరాయి. అయితే ఈ ప్రతిపాదనను చైనా వ్యతిరేకించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గతంలో ఇలాంటి ప్రతిపాదనలు వచ్చిన సమయంలో చైనా వ్యతిరేకించిందన్న వాదనలు తెరమీదకు వస్తున్నాయి. మరి ఐరాస భద్రతా మండలి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

ట్రెండింగ్ వార్తలు