దేశముదురు వ్యాపారులు : పాక్ డౌన్ డౌన్ అంటే డిస్కౌంట్లు

  • Publish Date - February 21, 2019 / 07:38 AM IST

రాయ్‌పూర్: పుల్వామా దాడి తర్వాత పాకిస్థాన్ పేరు చెబితేనే భారతీయుల పిడికిళ్లు బిగుసుకుంటున్నాయి. దేశ ప్రజల రక్తం మరుగుతోంది. పాకిస్థాన్ ను మట్టు పెట్టేయాలన్నంత కసి పెరుగుతోంది. దేశంలో ఎక్కడ చూసినా పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలు, నిరసనలు హోరెత్తుతున్నాయి. ఈ సెంటిమెంట్ లో తమ వ్యాపారాలను తమ వస్తువులను అమ్ముకుంటున్నారు. రెండు అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఢిల్లీలో ఓ బూట్ల దుకాణం వ్యక్తి ఈ పాకిస్థాన్ వ్యతిరేకతను ఎలా ప్రచారంగా వాడుకున్నాడో చూడండి. షాపు ఓనర్‌ రోడ్డుపై నిలబడి పాకిస్తాన్‌ వ్యతిరేక నినాదాలు చేస్తూ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీకి చెందిన ఉర్దూ కవి ఇమ్రాన్‌ ప్రతాప్‌గర్హి ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్‌ చేశాడు. ప్రాంతీయభావాన్ని అద్భుతంగా అమ్ముకుంటున్నాడంటూ ఆయన ఈ వీడియో పోస్ట్‌ చేయడం విశేషం. పాకిస్థాన్‌ ముర్దాబాద్‌.. 1100లకే మూడు జతల షూ అంటూ తన షాపులోకి కస్టమర్లను ఆహ్వానించాడు. చాలామంది కస్టమర్లు ఆయన షాపువైపు ఆకర్షితులయ్యారట.

తాజాగా చత్తీస్‌గఢ్‌లో అంజల్ సింగ్ అనే ఓ ఫుడ్‌స్టాల్ ఓనర్ కూడా తన దగ్గరికి వచ్చే కోసం ఓ ఆఫర్ ప్రకటించాడు. పాకిస్థాన్ ముర్దాబాద్ (డౌన్ డౌన్) అనండి.. చికెన్ లెగ్ పీస్‌పై రూ.10 డిస్కౌంట్ పొందండి అంటూ ఓ ఆఫర్ అతను ప్రకటించుకుంటున్నాడు. పాకిస్థాన్ ఎప్పుడూ మానవత్వానికి విలువ ఇవ్వలేదు. ఇవ్వదు కూడా. అందుకే ప్రతి ఒక్కరూ పాకిస్థాన్ ముర్దాబాద్ అనాలి అని అంజల్ సింగ్ అంటున్నాడు. 
 

 

 

Read Also:జియో ఎఫెక్ట్ : BSNL డేటా సునామీ ఆఫర్
Read Also:విన్నర్ ఎవరంటే: కొండచిలువ, మొసలి బిగ్ ఫైట్ చూశారా?