Pune Murder Case : పుణె హత్యకేసులో సంచలన ట్విస్ట్! హత్యకు 34 నిమిషాల ముందు ప్రియుడితో సీక్రెట్ కాల్.. ఏం మాట్లాడిందంటే?
Pune Murder Case : కేతన్ అగర్వాల్ హత్య ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేతన్ హత్యకు 34నిమిషాలకు ముందు నిందితురాలు సియా గోయల్ తన ప్రియుడు, సహ నిందితుడు చేతన చౌదరికి ఫోన్ చేసినట్లు కాల్ డేటా రికార్డు ద్వారా పోలీసు వర్గాలు గుర్తించాయి.
pune murder case Updates _ New Findings In Ketan Agarwal Murder Probe
- పుణెలోని కేతన్ హత్యకేసులో సంచలన ట్విస్ట్!
- హత్యకు 34 నిమిషాల ముందు ప్రియుడితో సీక్రెట్ కాల్
- పాస్‌పోర్టు మాయంపై కీలక ఆధారాలు లభ్యం
Pune Murder Case : పుణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో విచారణ చేస్తున్నా కొద్దీ ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేతన్ హత్యకు 34నిమిషాలకు ముందు నిందితురాలు సియా గోయల్ తన ప్రియుడు, సహ నిందితుడు చేతన చౌదరికి ఫోన్ చేసినట్లు కాల్ డేటా రికార్డు ద్వారా పోలీసు వర్గాలు గుర్తించాయి.
Also Read : Hyderabad : గృహప్రవేశం వేడుకలో వీరంగం.. ఈ ఇళ్లు నువ్వెలా కొంటావ్..? ఇంటిపై దాడి, కార్లు ధ్వంసం! రచ్చరచ్చ
ఫోన్ కాల్ అనంతరం ఇద్దరూ ముందుగా వేసుకున్న ప్రణాళికను అమలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలు, కాల్ రికార్డులు, డిజిటల్ సమాచారం ఈ కేసులో కీలక సాక్ష్యాలుగా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో.. సియా గోయల్, చేతన చౌదరిలు కేతన్ హత్యకు ముందు పలుమార్లు సమావేశమైనట్లు, ఘటనకు ముందు హత్యకు సంబంధించిన ప్రణాళిక రూపొందించినట్లు, అలాగే ఆధారాలను చెరిపివేయడానికి మొబైల్ చాట్ లు, ఇతర డిజిటల్ సమాచారాన్ని తొలగించినట్లు కూడా ఆరోపణులు వెల్లువెత్తాయి. ఈ అంశాలపై ఫోరెన్సిక్ నిపుణులు మరింత లోతుగా పరిశీలిస్తున్నారు.
మరోవైపు.. జూన్ 6న ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కోసం కేతన్, సియాలు బాలి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే, చివరి నిమిషంలో ఆ పర్యటన రద్దయింది. దీనికి కారణం కేతన్ పాస్‌పోర్టు కనిపించకపోటమే. అయితే, ఆ సమయంలో పాస్ పోర్టు కనిపించక పోవటం వెనుక కారణం ఏమిటనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగా నిశ్చితార్థం అయిన కేతన్ అగర్వాల్‌తో కలిసి బాలి వెళ్లాల్సిన ప్రీ-వెడ్డింగ్ ట్రిప్‌ను అడ్డుకునేందుకు ప్రధాన నిందితురాలు సియా గోయల్ అతని పాస్‌పోర్ట్‌ను ఉద్దేశపూర్వకంగానే మాయం చేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు.
దర్యాప్తులో భాగంగా కేతన్, సియా గోయల్‌ను ముంబై విమానాశ్రయానికి తీసుకెళ్లిన క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు విచారించారు. అతని వాంగ్మూలం ప్రకారం, ప్రయాణం మధ్యలో సియా కారు ఆపాలని చెప్పి కొద్దిసేపు బయటకు వెళ్లిందని, అనంతరం విమానాశ్రయానికి చేరుకున్నాక కేతన్ పాస్‌పోర్ట్ కనిపించకపోవడంతో బాలి ప్రయాణాన్ని రద్దు చేసుకుని ఇద్దరూ తిరిగి పుణెకు వెళ్లినట్లు వెల్లడించాడు.
పోలీసుల అనుమానం ప్రకారం.. సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కేతన్‌ను హత్య చేయడానికి ముందుగానే కుట్ర పన్నింది. బాలి ట్రిప్ జరిగితే తమ ప్రణాళికకు ఆటంకం కలుగుతుందని భావించి పాస్‌పోర్ట్‌ను దాచిపెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కేసులో సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా రికార్డులు, క్యాబ్ డ్రైవర్ వాంగ్మూలం, ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఆధారాలన్నీ కేసు దర్యాప్తులో కీలకంగా మారాయని అధికారులు చెబుతున్నారు.
పాస్‌పోర్టు కనిపించకుండా పోవడంపై కేతన్ తండ్రి కూడా పలు అనుమానాలు వ్యక్తం చేశాడు. మొత్తం కారులో నలుగురు ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. కారు ఎక్కేముందు అందరూ తమ పాస్‌పోర్టులు, ఇతర డాక్యుమెంట్లను సరిచూసుకున్నారు. వాటన్నింటిని ఒకే పర్సులో ఉంచారని తెలిపారు. కేవలం కేతన్ పాస్‌పోర్టు మాత్రమే మాయం అయిందని అన్నాడు.
