భద్రతాదళ అధికారులతో పంజాబ్ సీఎం సమావేశం

దాడులు,ప్రతిదాడులతో భారత్-పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు దిగుతున్న సమయంలో ఆర్మీ అలర్ట్ అయింది. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆర్మీ,పారామిలటరీ,పోలీసు ఉన్నతాధికారులతో పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సమావేశం నిర్వహించారు. బోర్డర్ లో తీసుకుంటున్న చర్యలపై భద్రతాదళ అధికారులతో సమీక్షించారు. 
బుధవారం(ఫిబ్రవరి-27,2019) ఎల్ వోసీ దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్ యుద్ధ విమానాన్ని భారత్ కూల్చివేసింది. అయితే ఇదే సమయంలో పాక్ రెండు భారత యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. భారత్ కు చెందిన మిగ్-21పైలట్ ను పాక్ అరెస్ట్ చేసి అతడిని చిత్రహింసలు పెడుతున్న వీడియోను రిలీజ్ చేసింది. దీనిపై యావత్ భారతదేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భారత పైలట్ క్షేమంగా తిరిగిరావాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.