సీఎం రిక్వెస్ట్: హాకీ లెజెండ్‌కు భారత రత్న!

భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి కొన్ని సంవత్సరాల పాటు దేశ ఖ్యాతిని దశదిశలా పెరిగేలా చేసిన హాకీ ప్లేయర్ బల్బీర్ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలని పంజాబ్ ముఖ్యమంత్రి కోరారు. ట్రిపుల్ ఒలింపిక్ హాకీ గోల్డ్ మెడలిస్ట్ బల్బీర్ సింగ్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలని నరేంద్ర మోడీకి లేఖ ద్వారా అభ్యర్థన పంపారు పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్. గురువారం ఆయన అధికారిక ట్విట్టర్ ద్వారా తాను బల్బీర్ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోడీని కోరినట్లు వెల్లడించారు.
‘శ్రీ బల్బీర్ సింగ్(సీనియర్) హకీలో అత్యద్భుతమైన ప్రదర్శనకు భారత రత్న ఇచ్చి గౌరవించాలని ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశాను’ అని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. జులై నెలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కాలేజీలో జరిగిన కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. క్రీడల్లో అద్భుత ప్రదర్శన చేసిన వారికి ఇచ్చే మహారాజ రంజిత్ సింగ్ అవార్డును ఆయన చేతుల మీదుగా బల్బీర్‌కు ఇచ్చారు.
దాంతో పాటు అతని చికిత్స కోసం రూ.5లక్షలు అందజేశారు. బల్బీర్ సింగ్(సీనియర్), 94 మూడు సార్లు ఒలింపిక్ పతకం గెలుచుకున్న జట్టులో ప్లేయర్. లండన్(1948), హెల్సింకి(1952), మెల్‌బౌర్న్(1956)వేదికలుగా టోర్నీలు జరిగాయి. భారత ఒలింపిక్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. దాంతో పాటు 1975వరల్డ్ కప్ విన్నింగ్ జట్టుకు మేనేజర్ గా కూడా వ్యవహరించారు.