Punjab : మోదీతో పంజాబ్ సీఎం భేటీ

ఎన్నికల్లో ఆప్ సాధించిన విజయానికి ఆయన గ్రీటింగ్స్ చెప్పారు. కేంద్రం నుంచి అందాల్సిన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని మోదీ హామీనిచ్చారు...

Bhagwant Mann Meets PM Modi : పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం భగవంత్ మాన్ తొలిసారిగా ఢిల్లీ పర్యటనకు వచ్చారు. 2022, మార్చి 24వ తేదీ గురువారం ఉదయం ఢిల్లీకి వచ్చిన ఆయన.. నేరుగా ప్రధాన మంత్రి కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా..మాన్ కు ఘన స్వాగతం పలికారు మోదీ. ఎన్నికల్లో ఆప్ సాధించిన విజయానికి ఆయన గ్రీటింగ్స్ చెప్పారు. కేంద్రం నుంచి అందాల్సిన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని మోదీ హామీనిచ్చారు. కొత్తగా ముఖ్యమంత్రుల పదవులు చేపట్టిన అనంతరం మర్యాద పూర్వకంగా ప్రధానిని కలుస్తారనే సంగతి తెలిసిందే. అందులో భాగంగానే పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రధానిని కలిశారు. ఈ భేటీలో రాజకీయ అంశాలు చర్చకు రాలేదని తెలుస్తోంది. కేవలం మర్యాదపూర్వక భేటీ అని సమాచారం. మోదీతో భేటీ అనంతరం ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కే్జ్రీవాల్ ను కూడా కలువనున్నారు.

Read More : Punjab : లంచం అడిగారా ఈ నెంబర్‌‌కు ఫిర్యాదు చేయండి

ఇటీవలే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆఫ్ విజయదుందుభి మ్రోగించింది. 117 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఆప్ ఏకంగా 92 సీట్లలో విజయం సాధించింది. ఆప్ విజయం సాధించిన వెంటనే నయా పాలిటిక్స్ ప్రారంభమయ్యాయి. పంజాబ్‌లో సామాన్యుడి ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో చూపిస్తామంటూ హింట్ ఇస్తున్నారు. సీఎంగా పదవీ ప్రమాణం చేయకముందే రాష్ట్రంలో ఉన్న పలువురు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేల భద్రత తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాజ్‌భవన్ లో కాకుండా భగత్ సింగ్ గ్రామమైన ఖట్కర్ కలన్‌లో సీఎంగా ప్రమాణం చేస్తానని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన.. ఇక నుంచి గవర్నమెంటు ఆఫీసుల్లో సీఎం ఫొటోలు ఉండవని, షహీద్ భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటోలు ఉండాలని ఆదేశించడంతో జనం జేజేలు కొడుతున్నారు.

Read More : AAP Punjab: పంజాబ్ నుంచి ఐదుగురు రాజ్యసభ ఎంపీలను నామినేట్ చేసిన ఆమ్ ఆద్మీ

16న భగత్‌సింగ్‌ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్‌కలన్‌లో పంజాబ్‌ సీఎంగా భగవంత్ మాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. హాస్యనటుడు నుంచి ముఖ్యమంత్రి వరకు కొనసాగిన ఆయన ప్రస్థానంలో ఎన్నో పరాజయాలు.. మరెన్నో విజయాలు ఉన్నాయి. అయితే ఓటములకు కుంగిపోని ఆయన.. గెలుపుతోనే విమర్శకులకు సమాధానం చెప్పారు. గవంత్ మాన్ 1972 అక్టోబర్ 17న పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లా సతోజ్ గ్రామంలో జన్మించారు. అతని తండ్రి పేరు మోహిందర్ సింగ్, ఆయన ఉపాధ్యాయుడు.

ట్రెండింగ్ వార్తలు