Punjab : లంచం అడిగారా ఈ నెంబర్‌‌కు ఫిర్యాదు చేయండి

యాంటీ - కరప్షన్ యాక్షన్ లైన్ నంబర్ ప్రకటించారు. 9501200200 చేసి ఫిర్యాదు చేయవచ్చిన పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో వచ్చిన ఫిర్యాదులపై కఠిన చర్యలు ఉంటాయని...

Punjab : లంచం అడిగారా ఈ నెంబర్‌‌కు ఫిర్యాదు చేయండి

Punjab

Punjab Anti-Corruption Helpline : పంజాబ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది ఆప్ పార్టీ. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఆప్ విజయదుందుభి మ్రోగించింది. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్ లో ఆప్ పార్టీ ఏకంగా 92 సీట్లలో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముందుగానే ఆ పార్టీ ప్రకటించనట్లుగానే సీఎంగా భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందు.. సంచలన నిర్ణయాలు తీసుకుని తమ పాలన ఎలా ఉంటుందో ప్రజలకు చెప్పారు.

Read More : AAP Punjab: పంజాబ్ నుంచి ఐదుగురు రాజ్యసభ ఎంపీలను నామినేట్ చేసిన ఆమ్ ఆద్మీ

రాజ్ భవన్ లో కాకుండా… భగత్ సింగ్ (Bhagat Singh) గ్రామమైన ఖట్కర్ కలన్ లో సీఎంగా ప్రమాణం చేస్తానని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు. అంతేగాకుండా కార్యాలయాల్లో సీఎం ఫొటోలు ఉండవని, షహీద్ భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటోలు ఉంటాయని వెల్లడించారు. మరొక కీలక నిర్ణయం తీసుకున్నారాయన. నవజ్యోత్ సింగ్ సిద్ధూతో పాటు 122 మంది మాజీ ఎమ్మెల్యేల భద్రత తొలగిస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. అనంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం అవినీతిపై కీలక ప్రకటన చేశారు. ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ప్రారంభిస్తామని తెలిపారు. మార్చి 23న స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ వర్ధంతి నాడు ‘అవినీతి నిరోధక హెల్ప్ లైన్’ ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read More : Punjab AAP Govt :పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం..25,000 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ నిర్ణయం

అన్నట్లుగానే యాంటీ – కరప్షన్ యాక్షన్ లైన్ నంబర్ ప్రకటించారు. 9501200200 చేసి ఫిర్యాదు చేయవచ్చిన పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో వచ్చిన ఫిర్యాదులపై కఠిన చర్యలు ఉంటాయని, ఎవరైనా ప్రజల్ని లంచం అడిగితే దానిని వీడియో తీసి పంపాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్  ప్రకటించారు. అనినీతి నిరోధక సిబ్బంది న్యాయమైన విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటారన్నారు. సర్కార్ అధికారంలోకి వస్తే.. అవినీతిని అంతమొందిస్తానని ఎన్నికల ప్రచారంలో పార్టీ అధినేత, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. పంజాబ్ ప్రభుత్వం ప్రకటించిన ఈ నెంబర్ కు ఎలాంటి రెస్పాండ్ వస్తుందో. ఎంతమంది అవినీతిపరుల విషయాలు బట్టబయలవుతాయో చూడాలి.