Punjab AAP Govt :పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం..25,000 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ నిర్ణయం

పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ కూడా నిర్వహించింది. ఈ మీటింగ్ లో 25,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించింది.

Punjab AAP Govt :పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం..25,000 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ నిర్ణయం

Punjab Aap Cabinet Decides To Replace 25,000 Jobs

Punjab AAP cabinet decides to replace 25,000 jobs :పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయటం ..జాతీయ పార్టీలను, స్థానిక పార్టీలను ఊడ్చిపారేసి గెలుపొందటం..ప్రభుత్వం ఏర్పాటుచేయటం సీఎం ప్రమాణస్వీకారం వంటివి ఆప్ చకచకా చేసేసింది. సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం తరువాత అంతకంటే వేగంగా పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం మంత్రివర్గం విస్తరణ కూడా చేపట్టింది.కొత్తగా కొలువుదీరిన పంజాబ్‌ కొత్త మంత్రివర్గం.. 10 మంది మంత్రుల ప్రమాణస్వీకారం కూడా చకచకా జరిగిపోయింది. ఇలా అన్నింటిలోను దూకుడుగా ఉన్న ఆప్ ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ కూడా నిర్వహించింది. సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని మంత్రివర్గంలో 10 మంది ఆప్ ఎమ్మెల్యేలు శనివారం (మార్చి 19) ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం సీఎం భగవంత్ మాన్ కేబినెట్ సమావేశం కూడా నిర్వహించారు. ఈ కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంట్లో భాగంగా ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో 25,000 పోస్టుల భర్తీ చేయాలని ఆప్ తొలి కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది.

Also read : Punjab New AAP Cabinet : కొలువుదీరిన పంజాబ్‌ కొత్త మంత్రివర్గం.. 10 మంది మంత్రుల ప్రమాణస్వీకారం

కాగా పంజాబ్‌లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. భగవంత్ మాన్ నేతృత్వంలోని మంత్రివర్గంలో 10 మంది ఆప్ ఎమ్మెల్యేలు శనివారం (మార్చి 19) ప్రమాణస్వీకారం చేశారు. పంజాబ్‌లోని రాజ్ భవన్‌లో ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఆప్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఒక మహిళ సహా 10 మంది కేబినెట్ మంత్రుల్లో 8 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరంతా పంజాబీలో ప్రమాణం చేశారు. పంజాబ్ కొత్త కేబినెట్ మంత్రుల్లో హర్పాల్ సింగ్ చీమా, హర్భజన్ సింగ్, డాక్టర్ విజయ్ సింగ్లా, లాల్ చంద్, గుర్మీత్ సింగ్ మీత్ హేయర్, కుల్దీప్ సింగ్ ధలీవాల్, లల్జిత్ సింగ్ భుల్లర్, బ్రామ్ శంకర్ జింపా, హర్జోత్ సింగ్ బెయిన్స్‌ ఉన్నారు. వీరిలో ఏకైక మహిళ డాక్టర్ బల్జీత్ కౌర్‌ మంత్రిగా ప్రమాణం చేశారు.

పంజాబ్ అసెంబ్లీ సభాపతిగా కుల్తార్‌సింగ్ సంధ్‌వాన్‌ను నామినేట్ చేయాలని ఆప్‌ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు గానూ 92 సీట్లు కైవసం చేసుకుని ఆమ్​ ఆద్మీ పార్టీ చరిత్ర సృష్టించింది. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్​ కాకుండా తొలిసారి మరో పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్-బహుజన్ సమాజ్ పార్టీ కూటమితో BJP-పంజాబ్ లోక్ కాంగ్రెస్-SAD (సంయుక్త్) కూటమిని చిత్తు చేసింది. పంజాబ్ కొత్త కేబినెట్‌లో సీఎం సహా 18 స్థానాలు ఉన్నాయి. ఇటీవలే స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలాన్‌లో సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణం చేశారు.

Also read : Bhagwant Mann : తగ్గేదేలే…అంటున్న పంజాబ్ కొత్త సీఎం భగవంత్ మాన్‌

పంజాబ్‌లో మొదటి నుంచి అవినీతి రహిత పాలన అందిస్తామని ఆప్ హమీలు ఇచ్చింది. అదే దిశగా ఆప్ అడుగులు వేసింది. అత్యంత నిజాయితీ గల ప్రభుత్వంగా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం పేరు తెచ్చుకుంటుందని మాన్ ట్వీట్ చేశారు. తన మంత్రి వర్గ కూర్పులో అన్ని వృత్తుల శాసన సభ్యులకు అవకాశం కల్పించినట్టు ఆయన చెప్పారు. ఇద్దరు వ్యవసాయదారులు, ముగ్గురు లాయర్లు, ఇద్దరు డాక్టర్లు, ఒక సామాజిక కార్యకర్త, ఒక ఇంజనీర్, ఒక వ్యాపారవేత్తకు కొత్త మంత్రివర్గంలో చోటు కల్పించారు.