Punjab : నాకొద్దు ఈ పదవి, సోనియాకు అమరీందర్ లేఖ!

పంజాబ్ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది. పార్టీలో నెలకొన్న సంక్షోభం ముదిరిపాకాన పడుతున్నట్లు కనిపిస్తోంది.

Punjab Congress : పంజాబ్ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది. పార్టీలో నెలకొన్న సంక్షోభం ముదిరిపాకాన పడుతున్నట్లు కనిపిస్తోంది. గత కొంతకాలంగా..సీఎం అమరీందర్, కీలక నేత, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య విబేధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జరుగుతున్న పరిణామాలపై అమరీందర్ తీవ్ర మనస్థాపానికి గురవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో..సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయన యోచిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని సోనియా గాంధీకి లేఖ ద్వారా తెలియచేసినట్లు సమాచారం. ఏ క్షణమైనా ఆయన గవర్నర్ కు రాజీనామా లేఖను అందించనున్నారని పార్టీ వర్గాల్లో ఓ చర్చ నడుస్తోంది.

Read More : Kidnap : బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు.. చివరకు జైలుకు వెళ్ళాడు

ఇదే విషయాన్ని అధిష్టానానికి తెలియచేసినట్లు సమాచారం. పంజాబ్ లో నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ లో కొనసాగలేనని సోనియాకు అమరీందర్ తేల్చిచెప్పారు. పార్టీ వీడుతానని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో పంజాబ్ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసి అమరీందర్ వారుసుడిని ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తోంది. 2021, సెప్టెంబర్ 18వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు సమావేశం జరుగనుంది.  హరీశ్ రావత్, అజయ్ మాకెన్ లు పరీశీలకులుగా హాజరు కానున్నారు.

Read More : Sonu Sood: రూ.20కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు సోనూసూద్‌పై ఐటీ ఆరోపణలు

పంజాబ్ కాంగ్రెస్ ఇన్ చార్జ్ గా ఉన్న హరీశ్ రావత్ అర్ధరాత్రి సమయంలో ఓ ట్వీట్ చేశారు. అత్యవసర శానసభాపక్ష సమావేశం నిర్వహించబోతున్నట్లు, ప్రతొక్కరూ హాజరు కావాలని అందులో కోరడం తాజా పరిణామాలకు దారి తీసిందని చెప్పవచ్చు. పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ సైతం..ప్రతొక్కరూ సమావేశానికి రావాలని ఆదేశించడం గమనార్హం. మరి అమరీందర్ సింగ్ రాజీనామా చేస్తారా? చేస్తే..ఆయన స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనేది రానున్న రోజుల్లో తెలియనుంది.

ట్రెండింగ్ వార్తలు