Kidnap : బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు.. చివరకు జైలుకు వెళ్ళాడు

బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కుల్కచర్లలో చోటుచేసుకుంది

Kidnap : బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు.. చివరకు జైలుకు వెళ్ళాడు

Kidnap

Updated On : September 18, 2021 / 1:14 PM IST

Kidnap : బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కుల్కచర్లలో చోటుచేసుకుంది. ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కుల్కచర్లకు చెందిన బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 12న ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాలేదు.. ఆమె కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు.

Read More : Husband Missing : నా భర్త కనిపించడం లేదు..కెనడాలో హైదరాబాద్ యువతి ఆవేదన

ఆచూకీ దొరక్కపోవడంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు శ్రీను అనే యువకుడిపై అనుమానం ఉందని బాలిక తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో బాలుడు సదరు యువతిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. దీంతో శ్రీనుని అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. బాలికను సఖి సెంటర్ కి తరలించారు.

Read More : Sonu Sood: రూ.20కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు సోనూసూద్‌పై ఐటీ ఆరోపణలు