Red Carpet Welcome For Girl Child
Red Carpet Welcome For Girl Child : ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేసే ఘనులున్నారు. కోడల్ని వదిలించుకునే అత్తమామలున్నారు. ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే గర్భంలోనే అంతమొందించే ఘటనలు గురించి కూడా విన్నాం.కానీ ఓ జంట మాత్రం తమకు ఆడపిల్లపుట్టింది పట్టరాని సంతోషంతో ఆ బిడ్డను రథంపై ఊరేగిస్తూ ఇంటికి తీసుకెళ్లారు. బంధువులు బ్యాండుబాజాలతో అంగరంగ వైభోగంగా ఆ చంటిపాపను రథంపై ఊరేగిస్తూ డ్యాన్సులు వేస్తూ ఘనంగా ఇంటికి తీసుకొచ్చారు.
పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన సాగర్, జాన్వి దంపతులకు ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం ఆడబిడ్డ జన్మించింది. ఆ పసిపాపను చూసిన ఆ దంపతుల ఆనందం అంతా ఇంతాకాదు. లక్ష్మీదేవే పాప రూపంలో పుట్టిందని మురిసిపోయారు. ఆ పాపను ఘనంగా ఆస్పత్రినుంచి ఇంటికి తీసుకెళ్లాలని అనుకున్నారు. దాని కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. చంటిపాపను ఆసుపత్రి నుంచి రథంపై ఊరేగిస్తూ ఇంటికి తీసుకెళ్లారు. బ్యాండు బాజాలతో, బంధువుల కోలాహలం మధ్య వేడుకను అంగరంగ వైభోగంగా ఊరేగిస్తూ ఇంటికి తీసుకెళ్లారు. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని అటువంటి లక్ష్మీదేవే మాకు పాపగా పుట్టటం మా అదృష్టంగా భావిస్తున్నామని సాగర్, జాన్వి దంపతులు పట్టరాని సంతోషం వ్యక్తంచేస్తూ వెల్లడించారు.