అదృష్టవంతురాలు.. వంద రూపాయలతో కోటీశ్వరరాలైన మధ్యతరగతి ఇల్లాలు

Housewife Wins Rs 1 Crore From Lottery Ticket: అదృష్ట దేవత ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. కానీ, ఒక్కసారి అనుగ్రహించిందంటే చాలు.. జీవితాలే మారిపోతాయి. కడు పేదరికంలో ఉన్న వారు కూడా ఓవర్ నైట్ లో ధనవంతులైపోతారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన గృహిణి విషయంలో ఇదే జరిగింది. ఆమె జీవితం కూడా రాత్రికి రాత్రే మారిపోయింది. ఓ వంద రూపాయలు ఆమెను కోటీశ్వరరాలుని చేసింది. జీవితంలో తొలిసారి… 100 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొంటే.. ఏకంగా కోటి రూపాయలు నగదు వచ్చింది.

జీవితంలో తొలిసారి లాటరీ కొనింది:
అమృత్‌సర్‌కు చెందిన రేణూ చౌహాన్‌ ఓ సాధారణ గృహిణి. మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన ఆమె కొద్దిరోజుల కిందట జీవితంలో తొలిసారిగా 100 రూపాయలు పెట్టి పంజాబ్ స్టేట్ డియర్ 100+ మంత్లీ లాటరీ టికెట్ కొనుగోలు చేసింది. లాటరీ తీయగా ఆమె ప్రైజ్‌ విన్నర్‌గా నిలిచింది. ఏకంగా కోటి రూపాయల నగదు గెలుచుకుంది.

రూ.100తో కోటి రూపాయలు గెలిచింది:
ఈ లాటరీ ఫలితాలను ఫిబ్రవరి 11న ప్రకటించినట్టు పంజాబ్ లాటరీ డిపార్ట్‌మెంట్‌ అధికారులు తెలిపారు(పంజాబ్‌లో లాటరీలను అధికారికంగా నిర్వహిస్తారు). ‘టిక్కెట్ నంబర్‌ D-12228పై రేణూ చౌహాన్ లాటరీ గెలిచారు. లాటరీ మొత్తాన్ని పొందడానికి అవసరమైన పత్రాలన్నింటినీ ఆమె సమర్పించారు. ప్రైజ్‌ మనీని త్వరలోనే ఆమె బ్యాంకు ఖాతాలో జమచేస్తాం’ అని అధికారులు తెలిపారు.

కష్టాలు, అప్పులు తీరతాయి:
తాను కొన్న లాటరీకి కోటి రూపాయలు వచ్చిందన్న వార్తతో రేణు సంతోషానికి అవధుల్లేవు. తాను నమ్మలేకపోతున్నా అని చెప్పింది. ఈ డబ్బుతో తన కష్టాలు తీరిపోతాయంది. ‘‘నా భర్త అమృత్‌సర్‌‌లో వస్త్ర దుకాణాన్ని నడుపుతున్నాడు. ఆయన సంపాదన మీదే మా ఇల్లు గడుస్తుంది. ఈ లాటరీ ప్రైజ్‌ మనీతో ఇక మా జీవితం పూర్తిగా మారిపోతుంది. మా అప్పులు, కష్టాలు అన్నీ తీరతాయి. వ్యాపారానికి సైతం ఆ డబ్బు ఉపయోగపడుతుంది’ అని భావోద్వేగంగా చెప్పింది రేణు.

రేణు.. నిన్నటి దాకా సాధారణ గృహిణి. మధ్యతరగతి కుటుంబం. భర్త నెలంతా కష్టపడితే కానీ ఇల్లు గడవని పరిస్థితి. అలాంటి ఆమె జీవితం రాత్రికి రాత్రే మారిపోవడం నిజంగా అద్భుతం అని స్థానికులు అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు