Waris Punjab De: పంజాబ్‭లో దారుణం.. పోలీసులతో కుస్తీ పడి కస్టడీ నుంచి మత గురువును విడుదల చేసిన మద్దతుదారులు

“ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఉధృతం చేయనివ్వనని అమిత్ షా చెప్పారని, ఇందిరా గాంధీ కూడా అదే చేశారని నేను చెప్పాను, మీరు అదే చేస్తే మీరు ఆ పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. 'హిందూ రాష్ట్రం' డిమాండ్ చేస్తున్న వారికి ఇదే మాట చెబితే ఆయన హోం మంత్రిగా కొనసాగగలరో లేదో చూద్దాం’’ అని అమృతపాల్ సింగ్ గురువారం అన్నారు.

Waris Punjab De: పంజాబ్‭లో దారుణం.. పోలీసులతో కుస్తీ పడి కస్టడీ నుంచి మత గురువును విడుదల చేసిన మద్దతుదారులు

Punjab Radical Leader's Aide To Be Freed After Supporters Clash With Cops

Updated On : February 23, 2023 / 7:20 PM IST

Waris Punjab De: బ్రిటిషు కాలంలో స్వాతంత్ర్య పోరాటం చేస్తున్న వారిని అరెస్ట్ చేసిన జైలులో నిర్భందిస్తే, వారి మద్దతుదారులు, ప్రజలు పోలీస్ స్టేషన్‭ను ముట్టడించి వారిని విడుదల చేసినట్లు పుస్తకాల్లో చదివే ఉంటాం. పంజాబ్ రాష్ట్రంలో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. తనను తాను దైవదూతగా ప్రకటించుకున్న మత బోధకుడి అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతే, అతడి మద్దతుదారులు గంటల్లోనే పోలీస్ స్టేషన్ ముట్టడించి అతడిని విడుదల చేశారు. రాష్ట్రంలోని అమృత్‭సర్ పట్టణంలో గురువారం వెలుగు చూసిందీ ఘటన. కాగా, దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Dog Attack Case : జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్లే పసివాడి ప్రాణాలు పోయాయని హైకోర్టు ఆగ్రహం

ఇక ఈ విషయమై అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ జస్కరన్ సింగ్ స్పందిస్తూ “అతను (లవ్‌ప్రీత్ తూఫాన్) నిర్దోషి అని అతడి మద్దతుదారులు తగిన సాక్ష్యం ఇచ్చారు. సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) దానిని ఇప్పటికే పరిశీలించింది. కొద్ది సమయంలోనే పరిస్థితులు అదుపులోకి వస్తాయి. చట్టం తన పని తాను చేసుకుంటుంది” అని అన్నారు. అమృతపాల్ సింగ్ నాయకత్వం వహిస్తున్న ‘వారిస్ పంజాబ్ దే’ అనే సంస్థకు చెందిన వ్యక్తి లవ్‌ప్రీత్ తూఫాన్. కాగా, లవ్‌ప్రీత్‭ను విడుదల చేయకుంటే తుపాకులు, కత్తులతో సాయుధులైన వందలాది మంది గుంపును అజ్నాలా పోలీస్ స్టేషన్‌లోకి వస్తుందని, లవ్‌ప్రీత్‭ను 24 గంటల్లో విడుదల చేయాలని అమృతపాల్ డిమాండ్ చేశారు.

MCD House: సభలో బీజేపీ, ఆప్ సభ్యుల కుమ్ములాట.. నిన్న రాత్రి అలసిపోయి అక్కడే పడుకున్నారు. ఈరోజు లేవగానే మళ్లీ స్టార్ట్

కాగా, ఆయన డిమాండ్ చేసిన ప్రకారమే.. వందలాది మంది కత్తులతో పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అయితే అప్పటికే సిట్ దర్యాప్తు ముగించి లవ్‌ప్రీత్‭ను నిర్దోషిగా తేల్చారు. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి కొట్టిన కేసులో లవ్‌ప్రీత్‭ను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘రాజకీయ ఉద్దేశ్యంతో మాత్రమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వారు కేసును 1 గంటలో రద్దు చేయకపోతే, తదుపరి ఏమి జరిగినా దానికి అడ్మినిస్ట్రేషనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మేమేమీ చేయలేమని వారు అనుకుంటున్నారు. అందుకు మేం బలప్రదర్శన చేసి తీరుతాం” అని అమృతపాల్ సింగ్ అన్నారు.

AP BJP Politics : ఢిల్లీ వెళ్లిన ఏపీ బీజేపీ నేతలకు క్లాస్ పీకిన హైకమాండ్

ఆపరేషన్ బ్లూ స్టార్ కోసం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లోకి సైన్యాన్ని పంపినందుకు మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీని ఆమె అంగరక్షకులే హత్య చేసినట్లు, అమిత్ షాకు కూడా అదే గతి పడుతుందని అమృతపాల్ సింగ్ ఇంతకు ముందు బెదిరింపులకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. ‘‘ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఉధృతం చేయనివ్వబోమని అమిత్ షా అన్నారు. ఇందిరా గాంధీ కూడా అదే చేశారని నేను గుర్తు చేస్తున్నాను. మీరు కూడా అలాగే చేయాలనుకుంటే దానికి తగిన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది’’ అని అన్నారు. ఇక దేశంలో ‘హిందూ రాష్ట్రం’ డిమాండ్‌ వస్తున్న నేపథ్యంలో ఖలిస్తానీ ఉద్యమంపై చేస్తున్న హెచ్చరికల్నే హిందూ రాష్ట్రం డిమాండ్ చేస్తున్న వారితో చేస్తే అమిత్ షా ఎంతకాలం హోంమంత్రిగా ఉంటారో చూస్తామంటూ అమృతపాల్ సింగ్ అన్నారు.