AP BJP Politics : ఢిల్లీ వెళ్లిన ఏపీ బీజేపీ నేతలకు క్లాస్ పీకిన హైకమాండ్

ఏపీ బీజేపీ నేతలపై హైకమాండ్ మండిపడింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఏపీ కాషాయదళం ఢిల్లీ వెళ్లింది. కానీ వారి మాటల్ని పెద్దగా పట్టించుకోని అధిష్టానం చీవాట్లు వేసింది. ఏపీ వచ్చాక అవన్నీ మాట్లాడుకుందాం అంటూ మందలించి పంపివేసింది అధిష్టానం.

AP BJP Politics : ఢిల్లీ వెళ్లిన  ఏపీ బీజేపీ నేతలకు క్లాస్ పీకిన  హైకమాండ్

AP BJP Politics

Andhra Pradesh: ఏపీ బీజేపీ నేతలపై హైకమాండ్ మండిపడింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఏపీ కాషాయదళం ఢిల్లీ వెళ్లింది. సోము తీరుతో ఏపీ బీజేపీకి తీవ్ర నష్టం జరుగుతోందని..ఈ విషయం హైకమాండ్ కు తెలియజేయాలని ఢిల్లీ వెళ్లారు. అలా సోము వీర్రాజుపై అసంతృప్తితో ఉన్న బీజేపీ నేతలతో ఏపీ బీజేపీ ఇంఛార్జ్ మురళీదరన్ సమావేశమయ్యారు. సమావేశంలో నాయకులందరికి మూకుమ్మడిగా మురళీధరన్ క్లాస్ పీకారు. ఇంతమంది ఎందుకు వచ్చారు? స్థానికంగా ఉండే విషయాలు తెలియజేయటానికి ఇంతమంది రావాలా? కొంతమంది వస్తే సరిపోదా? ఈ మాత్రం కూడా తెలియదా? అంటూ చీవాట్లు పెట్టారు.

ఢిల్లీలో మురళీధరన్‌తో భేటీ అయినవారిలో రాష్ట్ర బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి శ్యామ్ కిషోర్, టెక్కలి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భాస్కర్, కృష్ణాజిల్లా మాజీ అధ్యక్షుడు కుమారస్వామి, మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ కె.బాజి, బొడ్డు నాగలక్ష్మి, శ్రీనివాసరాజు, శ్రీకాకుళం, ఒంగోలు జిల్లాల మాజీ అధ్యక్షులతోపాటు పలువురు నేతలున్నారు.వీరందరికి మురళీధరన్ క్లాస్ పీకారు. నేను ఏపీకి వచ్చినప్పుడు చెప్పవచ్చు కదా..అంత అర్జంటు విషయం ఏమన్నా ఉంటే కొంతమంది మాత్రమే రావాల్సింది. కానీ ఇంతమంది ఎందుకు? అంటూ చీవాట్లు వేశారు. రెండు రోజుల్లో నేను రాజమండ్రి వస్తాను..మాట్లాడుకునేవి ఏమన్నా ఉంటే అక్కడే మాట్లాడుకుందాం..చర్చించుకుందాం..అంతేతప్ప ఎవ్వరు బహిరంగంగా పార్టీకి నష్టం జరిగేలా మాట్లాడవద్దని సూచించారు.

Andhra Pradesh: సోము వీర్రాజుపై అసంతృప్తిలో ఏపీ బీజేపీ నేతలు.. ఢిల్లీలో కీలక నేతలతో భేటీ

మరి ముఖ్యంగా ఏపీకి అధ్యక్షుడిని మార్చాలని నేతలు చెప్పటంపై కూడా మురళీధరన్ మాట్లాడుతూ..అధ్యక్షుడిని మార్చాల్సిన అసవరం ఏమన్నా ఉంటే అది అధిష్టానం చూసుకుంటుందని స్పష్టం చేశారు. ఇకనుంచి ఏపీ పరిస్థితులపైనా..పార్టీ విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపైనా చర్చించటానికి నెలలో రెండు రోజులు ఏపీలో పర్యటిస్తానని స్థానికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా చర్చించుకుని పరిష్కరించుకుందామని తెలిపారు.

కానీ పార్టీకి నష్టం జరుగుతోందని చెప్పటానికి వస్తే అధిష్టానం పట్టించుకోకుండా ఏదో పనిపాటా లేక ఢిల్లీ వచ్చినట్లుగా మాట్లాడటంపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇలా అయితే ఇక రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏంటి? అని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేసి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీకి రాజీనామా చేస్తూ కన్నా సోము వీర్రాజు తీరుపైనే విమర్శలు చేశారు. మోడీపై గౌరవం ఉందని కానీ ఏపీలో సోము వీర్రాజు తీరు వల్ల పార్టీ నష్టపోతోందని వాపోతున్నారు. తమ గోడు అధిష్టానం కూడా పట్టించుకోకపోతే ఎలా? అంటూ వాపోతున్నారు ఏపీ బీజేపీ నేతలు.