తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్ (నాందేడ్) వద్ద చిక్కుకుపోయిన యాత్రికులను తిరిగి తమ సొంత రాష్ట్రానికి తీసుకురావడానికి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదేశాల మేరకు 80 బస్సులను నాందేడ్‌కు పంపారు. అక్కడ చిక్కుకున్న యాత్రికులను తిరిగి రాష్ట్రానికి తీసుకురాబోతున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది.
యాత్రికులను తిరిగి తీసుకురావడానికి పంజాబ్ రోడ్‌వేస్.. పిఆర్‌టిసికి చెందిన ఎసీ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం పంపింది. మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ప్రతి బస్సులో ముగ్గురు డ్రైవర్లు, ఒక కండక్టర్, ఒక పోలీసు ఉంటారు. ఒక బస్సు అప్-డౌన్లో 3300 కిమీ కంటే ఎక్కువ దూరం ఉంటుంది. లాక్ డౌన్ కారణంగా పంజాబ్ నుండి 3200 మంది యాత్రికులు నాందేడ్‌లోని తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్ వద్ద చిక్కుకున్నారు.
ప్రయాణంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని డ్రైవర్లు, కండక్టర్లు మరియు పోలీసు సిబ్బందికి ప్రభుత్వం సూచనలు చేసింది. నాందేడ్‌లో చిక్కుకున్న పంజాబ్‌కు చెందిన యాత్రికుల్లో 219 మంది ఇప్పటికే స్వస్థలాలకు చేరుకున్నారని సీఎం తెలిపారు. మిగిలిన 643 మంది పంజాబ్‌కు చేర్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అమరీందర్ ట్వీట్ చేశారు. 80 పంజాబ్ ప్రభుత్వ బస్సులు సోమవారం ఉదయానికి నాందేడ్‌కు చేరుకుంటాయి.