MP Raghav Chadha : ముంబయి వచ్చిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా…కాబోయే భార్య పరిణీతి చోప్రాను కలిశారు
ముంబయి నగరంలో రెండు రోజుల పాటు జరగనున్న ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తనకు కాబోయే భార్య పరిణీతి చోప్రాను కలిశారు.....
- saleem sk
- Published On : August 31, 2023 / 08:11 AM IST
MP Raghav Chadha,Parineeti
MP Raghav Chadha : ముంబయి నగరంలో రెండు రోజుల పాటు జరగనున్న ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తనకు కాబోయే భార్య, బాలీవుడ్ సినీనటి పరిణీతి చోప్రాను కలిశారు. (Raghav Chadha in Mumbai for INDIA alliance) రాఘవ్ చద్దా బుధవారమే ఇండియా కూటమి సదస్సు జరిగే హోటల్ కు వచ్చారు. అనంతరం రాఘవ్ చద్దా తన ప్రియురాలు, సినీనటి పరిణీతి చోప్రా నటిస్తున్న వాణిజ్య ప్రకటన షూటింగు జరుగుతున్న బాంద్రాలోని మెహబూబ్ స్టూడియోకు వెళ్లి ఆమెను కలిశారు. (meets fiancee Parineeti Chopra)
Mallikarjun Kharge : ఇండియా బ్లాక్ చీఫ్‌గా మల్లికార్జున్ ఖర్గే?
రాఘవ్, పరిణీతిల నిశ్చితార్థం మే 13వతేదీన జరిగింది. వీరి పెళ్లి ఈ ఏడాది చివరిలో జరగనుందని భావిస్తున్నారు. ఈ ప్రేమ జంట ఇటీవల ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసింది. ఒక వైపు ఆప్ పక్షాన రాఘవ్ చద్దా ఇండియా కూటమి సమావేశాల్లో పాల్గొని కీలక పాత్ర పోషించనున్నారు. 28 పార్టీలు పాల్గొననున్న ఈ ప్రతిపక్షాల భేటీలో కొత్త లోగోతో పాటు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
