Raghuram Rajan: రఘురామ రాజన్‌తో కౌన్సిల్ ఏర్పాటు చేసిన తమిళనాడు సీఎం

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో దెబ్బతిన్న రాష్ట్రాలను ఆదుకోవడానికి ఐదుగురు సభ్యులతో కూడిన ఎకానమిక్ అడ్వైజరీ కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు.

Raghuram Rajan: రఘురామ రాజన్‌తో కౌన్సిల్ ఏర్పాటు చేసిన తమిళనాడు సీఎం

Stalin

Updated On : June 21, 2021 / 3:10 PM IST

Raghuram Rajan: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో దెబ్బతిన్న రాష్ట్రాలను ఆదుకోవడానికి ఐదుగురు సభ్యులతో కూడిన ఎకానమిక్ అడ్వైజరీ కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై ఈ కమిటీ సూచనలు చేయనుంది.

ఇందులో ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘు రామరాజన్‌‌తో పాటుగా కేంద్ర ప్రభుత్వ మాజీ చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రమణ్యన్, ఎకానమిస్ట్ జీన్ డ్రెజె, తమిళనాడు రిటైర్డ్ బ్యూరోక్రాట్ క్యాడర్ డా. ఎస్ నారాయణ్ లు సభ్యులుగా ఉండనున్నారు.

తమిళనాడు రాష్ట్ర ఆర్థిక మంత్రి పీటీఆర్ త్యాగరాజన్ ఓ మాజీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్. లేమన్ బ్రదర్స్, స్టాండర్డ్ చార్టర్డ్ వంటి ఆర్థిక సంస్థలతో కలిసి పనిచేశాడు. రాష్ట్రం కోవిడ్ తో కోల్పోయిన ఆర్థిక బలాన్ని తిరిగి పుంజుకోవాలని డీఎంకే ప్రయత్నిస్తున్నారు.