Rahul Gandhi: పీఎస్‌యూ రంగంలో ఉపాధి అవకాశాల కొరతపై రాహుల్ గాంధీ ట్వీట్.. కేంద్రం ప్రభుత్వంపై ఆగ్రహం..

ప్రతీయేటా రెండు లక్షల ఉద్యోగాలు పెంచడానికి బదులుగా రెండు లక్షలకుపైగా ఉద్యోగాలను తొలగించారని ఆరోపిస్తూ కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.

Rahul Gandhi

Congress Leader Rahul Gandhi: ఉద్యోగాల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. పీఎస్‌యూలు (ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు) రంగంలో ఉపాధి అవకాశాల కొరతపై ఆయన ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశంలో ఉపాధిని ప్రభుత్వం తగ్గించిందని రాహుల్ ఆరోపించారు. పీఎస్‌యులు భారతదేశానికి గర్వకారణం. ఉపాధికోసం ప్రతి యువకుడి కలగా ఉండేవి. కానీ, బీజేపీ ప్రభుత్వంలో వీటికి ప్రాధాన్యత లేదని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని పీఎస్‌యూల్లో ఉద్యోగాలు 2014లో 16.9లక్షల నుంచి 2022 నాటికి 14.6లక్షలకు తగ్గాయని రాహుల్ అన్నారు. బీఎస్‌ఎన్‍‌ఎల్‌లో 1,81,127, సెయిల్‌లో 61,928, ఎంటీఎన్‌ఎల్‌లో 34,997, ఎస్‌ఇసీఎల్‌లో 29,140, ​ఎఫ్‌సీఐ‌లో 28,063, ఒఎన్‌జిసిలో 21,120 ఉద్యోగాలు తగ్గాయని రాహుల్ గాంధీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.

US artist gift to Rahul Gandhi : సోనియా చిత్రపటాన్ని రాహుల్ గాంధీకి బహుమతిగా ఇచ్చిన US ఆర్టిస్ట్

ప్రతీయేటా రెండు లక్షల ఉద్యోగాలు పెంచడానికి బదులుగా రెండు లక్షలకుపైగా ఉద్యోగాలను తొలగించారని ఆరోపిస్తూ కేంద్రంపై రాహుల్ విమర్శలు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల పెంపుదల రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ హక్కును హరించివేయడం కాదా? అని రాహుల్ కేంద్రాన్ని ప్రశ్నించారు. కొద్దిమంది పెట్టుబడిదారుల ప్రయోజనాలకోసం కేంద్ర ప్రభుత్వం పాకులాడుతుందని, ఫలితంగా లక్షలాది మంది యువత ఆశలు సన్నగిల్లుతున్నాయని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rahul Gandhi: భారత్‌లో రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం.. న్యూయార్క్‌లో బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ ప్రభుత్వం హయాంలో దేశం రికార్డు స్థాయిలో నిరుద్యోగంతో మగ్గుతోందని రాహుల్ ఆరోపించారు. భారతదేశంలోని పీఎస్‌యూలకు సరియైన వాతావరణం, ప్రభుత్వం నుండి మద్దతు లభిస్తే అవి ఆర్థిక వ్యవస్థ, ఉపాధి రెండింటినీ పెంచగలవని రాహుల్ అన్నారు. పీఎస్‌యులు దేశం, దేశ వాసుల ఆస్తి అని, వాటిని ప్రోత్సహించాలని, తద్వారా అవి భారతదేశ పురోగతి పథాన్ని బలోపేతం చేస్తాయని రాహుల్ గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు.