US artist gift to Rahul Gandhi : సోనియా చిత్రపటాన్ని రాహుల్ గాంధీకి బహుమతిగా ఇచ్చిన US ఆర్టిస్ట్

US పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ ఆర్టిస్ట్ నుంచి అద్భుతమైన గిఫ్ట్ అందుకున్నారు. బొగ్గు, వాటర్ కలర్స్‌తో వేసిన సోనియా గాంధీ చిత్రపటాన్ని సరిత పాండే అనే ఆర్టిస్ట్ ఆయనకు బహుమతిగా అందించారు.

US artist gift to Rahul Gandhi : సోనియా చిత్రపటాన్ని రాహుల్ గాంధీకి బహుమతిగా ఇచ్చిన US ఆర్టిస్ట్

US artist gift to Rahul Gandhi

Updated On : June 10, 2023 / 12:25 PM IST

US artist gift to Rahul Gandhi : కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ 10 రోజులుగా యునైటెడ్ స్టేట్స్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో ఆయనకు ఓ ఆర్టిస్ట్ నుంచి అరుదైన బహుమతి లభించింది. యూఎస్‌కి చెందిన ఓ ఆర్టిస్ట్ సోనియాగాంధీ చిత్ర పటాన్ని రాహల్‌కి బహుమతిగా ఇచ్చారు.

Rahul Gandhi: తదుపరి టార్గెట్ తెలంగాణ ఎన్నికలు.. ఏం చేస్తామంటే?: అమెరికాలో రాహుల్ గాంధీ కామెంట్స్

రాహుల్ గాంధీ గతవారం వాషింగ్టన్, DC సందర్శించినపుడు మీడియా మరియు కమ్యూనికేషన్స్ ప్రొఫెషనల్ మరియు ఆర్టిస్ట్ అయిన సరితా పాండే ఆయనకు ప్రత్యేక బహుమతిని ఇచ్చారు. బొగ్గు మరియు వాటర్ కలర్‌తో వేసిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పెయింటింగ్‌ను రాహుల్‌కి అందించారు. ఈ విషయాన్నిసరిత పాండే తన ట్విట్టర్ అకౌంట్‌లో Sarita Pandey షేర్ చేసుకున్నారు. ‘ఒక తల్లి నుంచి మరొకరికి’ అని చెబుతూ ఈ చిత్రాన్ని సోనియా గాంధీకి పంపండి అని రాహుల్‌ని కోరానని ఆయన ఖచ్చితంగా సోనియాకు అందిస్తారని ఆశిస్తున్నానని సరిత ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

Rahul Gandhi : ప్రధాని మోదీ.. దేవుడికే పాఠాలు నేర్పించగలరు : రాహుల్ గాంధీ

‘అందమైన సందేశంతో అందమైన పెయింటింగ్.. యు ఆర్ రాకింగ్ ‘ అని ఒకరు.. ‘చాలా బాగుంది.. బొగ్గు, వాటర్ కలర్‌తో వేయడం చాలా కష్టమైన పని ‘ అని మరొకరు వరుసగా కామెంట్లు చేశారు. ఈ పెయింట్ సోనియాకు చేరాలని ఆర్టిస్ట్ సరితా పాండే కోరుకున్నట్లుగా ఆశిద్దాం.