Rahul Gandhi: తదుపరి టార్గెట్ తెలంగాణ ఎన్నికలు.. ఏం చేస్తామంటే?: అమెరికాలో రాహుల్ గాంధీ కామెంట్స్

కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయని రాహుల్ గాంధీ అన్నారు.

Rahul Gandhi: తదుపరి టార్గెట్ తెలంగాణ ఎన్నికలు.. ఏం చేస్తామంటే?: అమెరికాలో రాహుల్ గాంధీ కామెంట్స్

Rahul Gandhi

Updated On : June 4, 2023 / 5:59 PM IST

Rahul Gandhi – Telangana: బీజేపీ (BJP)ని చిత్తుగా ఓడించవచ్చని కర్ణాటక ఎన్నికల్లో (Karnataka elections 2023) నిరూపించామని, కేవలం ఓడించడమే కాకుండా ఆ పార్టీ పూర్తిగా క్షీణించిపోయేలా చేశామని కాంగ్రెస్ (Congress) నేత రాహుల్ గాంధీ అన్నారు. అదే విధంగా తెలంగాణ, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ గెలిచి బీజేపీ లేకుండా చేస్తామని చెప్పారు.

అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ఓవర్సీస్ కాంగ్రెస్-యూఎస్ఏ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తదుపరి తెలంగాణలో బీజేపీని లేకుండా చేస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాక ఆ రాష్ట్రంలో బీజేపీని ఉందని గుర్తించడం కూడా కష్టమవుతుందని చెప్పారు. డిసెంబరులో తెలంగాణలో ఎన్నికలు జరగాల్సి ఉంది.

తెలంగాణలో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ లోనూ కర్ణాటక ఫలితాలే వచ్చేలా చేస్తామని రాహుల్ అన్నారు. ద్వేషపూరిత భావజాలం ఉన్న బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ మాత్రమే కాకుండా భారత్ ప్రజలు అందరూ భావిస్తున్నారని తెలిపారు.

కర్ణాటక ఎన్నికల్లో గెలుపునకు బీజేపీ ఎన్నో కుట్రలు పన్నిందని, ఆ పార్టీ వద్ద తమ కంటే 10 రెట్ల డబ్బు అధికంగా ఉందని చెప్పారు. అంతేగాక, వారిదే ప్రభుత్వమని, ఏజెన్సీలు వారివేనని అన్నారు. వారివద్ద అన్నీ ఉన్నప్పటికీ తాము గట్టిగా దెబ్బకొట్టామని చెప్పారు.

Odisha Train Accident: రైల్వే మంత్రి రాజీనామాపై డిమాండ్.. మమత, లాలూ, నితీశ్‭లను మధ్యలోకి లాగిన బీజేపీ