Rahul Gandhi: గీత, ఉపనిషత్తుల్లో ఇలాంటివి ఎక్కడాలేవు: రాహుల్ గాంధీ

గీత, ఉపనిషత్తులతో పాటు ఎన్నో హిందూ పుస్తకాలు చదివానని రాహుల్ గాంధీ అన్నారు.

Rahul Gandhi

Rahul Gandhi – Congress: హిందూయిజానికి-బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేసే పనులకు సంబంధమే లేదంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. పారిస్ సైన్సెస్ పొ విశ్వవిద్యాలయంలో ఆయన తాజాగా మాట్లాడారు.

‘ గీత, ఉపనిషత్తులతో పాటు ఎన్నో హిందూ పుస్తకాలు చదివాను. బీజేపీ చేస్తున్న పనుల్లో హిందూ అనేదే లేదు. కచ్చితంగా లేదు. మన కన్నా బలహీనంగా ఉన్న వారికి హాని కలిగించాలని, వారిని భయపెట్టాలని మన హిందూ పుస్తకాల్లో లేదు.

హిందూయిజానికి-బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేసే పనులకు సంబంధమే లేదు. ఎదేమైనా సరే అధికారంలోకి రావాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉద్దేశం. సమాజంపై కొద్ది మంది ఆధిపత్యం ఉండాలని భావిస్తున్నాయి’ అని రాహుల్ గాంధీ అన్నారు.

కాగా, హిందూయిజాన్ని వాడుకుంటూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజకీయ లబ్ధి పొందుతున్నాయని ప్రతిపక్షాలు చాలా కాలంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. విదేశీ పర్యటనల్లోనూ బీజేపీ తీరుపై రాహుల్ గాంధీ అనేక సార్లు మండిపడ్డారు.

UK PM Rishi Sunak: ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్ దంపతులు