Rahul Gandhi : రిజర్వేషన్ల రద్దు అంశం.. ఎన్నికల సంఘంపై కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ

. ప్రధాని నరేంద్ర మోదీ అంటే నాకు ఎలాంటి ద్వేషం లేదు. మోదీని నేను ఎప్పుడూ నా శత్రువుగా చూడలేదు. చెబితే మీరు ఆశ్చర్యపోతారు.. చాలాసార్లు ఆయన..

Rahul Gandhi

Rahul Gandhi : అమెరికా పర్యటనలోఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వాషింగ్టన్ లోని ప్రతిష్టాత్మక జార్జ్ టౌన్ యూనివర్శిటీలో చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో రిజర్వేషన్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్ లో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరియైన ప్రాధాన్యం దక్కడం లేదని, అభివృద్ధిలో వారి భాగస్వామ్యం కూడా అంతంతమాత్రంగానే ఉందని అన్నారు. భారత్ లో అన్నివర్గాల వారికి పారదర్శక అవకాశాలు లభించే పరిస్థితులు వచ్చిన తరువాతే రిజర్వేషన్ల రద్దు గురించి తమ పార్టీ ఆలోచిస్తుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు పదేపదే ప్రస్తావించారు. కాంగ్రెస్ నేతలవి అసత్య ప్రచారాలని బీజేపీ నేతలు కొట్టిపారేశారు.

Also Read : మహిళలు ఇళ్లలోనే ఉండాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ భావిస్తున్నాయి: రాహుల్ గాంధీ

ప్రధాని నరేంద్ర మోదీపై నిత్యం విమర్శలతో విరుచుకుపడే రాహుల్ గాంధీ.. తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అంటే నాకు ఎలాంటి ద్వేషం లేదు. మోదీని నేను ఎప్పుడూ నా శత్రువుగా చూడలేదు. చెబితే మీరు ఆశ్చర్యపోతారు.. చాలాసార్లు ఆయన చేసే పనులు, తీసుకునే నిర్ణయాలను నేను అర్థం చేసుకోగలను. కానీ, ఆయన అభిప్రాయాలు వేరు.. వాటితో నేను ఏకీభవించలేను. అంతేకానీ.. మోదీపై నాకు ఎలాంటి ద్వేషం లేదని రాహుల్ అన్నారు.

 

సార్వత్రిక ఎన్నికల్లో.. ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా పనిచేసిదంటూ రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగి ఉంటే బీజేపీకి 240 సీట్లు కూడా వచ్చేవి కావు. ఎన్నికల సమయంలో మా బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి మా ప్రచారంపై దెబ్బకొట్టేందుకు ప్రయత్నించారు. మేము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ, వారికి ఆర్థికంగా అండ ఉంది. దీనికితోడు ఎన్నికల సంఘం కూడా వారికి అనుకూలంగా పనిచేసిందంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. అయితే, రాహుల్ గాంధీ అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు