Rahul Gandhi: బీజేపీ ప్రభుత్వంపై లోక్‌సభ సాక్షిగా రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. సరిహద్దు లోపల, బయట భారత్ తీవ్ర ప్రమాదంలో ఉందని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Rahul Gandi

Rahul Gandhi: ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎడగడుతూ లోక్‌సభ సాక్షిగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. సరిహద్దు లోపల, బయట భారత్ తీవ్ర ప్రమాదంలో ఉందని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ ప్రస్తుతం వ్యవహరిస్తున్న విదేశాంగ విధానంపై ఆందోళన వ్యక్తం చేసిన రాహుల్.. చైనా, పాక్ లను దగ్గర చేయడం బీజేపీ చేసిన అతి పెద్ద నేరమని వ్యాఖ్యానించారు. డోక్లాం, లద్దాఖ్ విషయంలో లోపాలు బయటపడ్డాయని.. భారత్ ను ఎదుర్కోవడంలో చైనాకు పక్కా ప్రణాళిక ఉందని రాహుల్ అన్నారు. భారత్ కు వ్యతిరేకంగా పాక్ చైనాలు ఆయుధాలు సమకూర్చుకుంటున్నాయన్న రాహుల్.. భారతదేశ భద్రత తీవ్ర ప్రమాదంలో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: Bajaj – Triumph new Bike: బజాజ్, ట్రయంఫ్ కలయికలో మొదటి బైక్ రెడీ, ఇక ప్రత్యర్థులతో యుద్ధమే

ఇక బీజేపీ ప్రభుత్వం దేశ అంతర్గతంగా.. రాష్ట్రాలతో వ్యవహరిస్తున్న విధానంపై రాహుల్ స్పందిస్తూ.. రాష్ట్రాల గొంతునొక్కేందుకు కేంద్ర వ్యవస్థలను బీజేపీ ప్రయోగిస్తుందని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రాలపై న్యాయవ్యవస్థ, ఈసీ, పెగాసస్ వంటి అస్త్రాలు ప్రయోగించి ఆయా రాష్ట్రాలను, ప్రాంతీయ పార్టీలను తమదారిలోకి తెచ్చుకునేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలను, బీజేపీయేతర రాష్ట్రాలను భాజపా విభజించి చూస్తుందంటూ విమర్శలు గుప్పించారు.

Also read: Village Volunteer: వాలంటీర్ వక్ర బుద్ధి: వృద్దురాలి పెన్షన్ కాజేసిన వైనం

ఉద్యోగాల కల్పనపై రాహుల్ స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వం చెబుతున్న దానికి వాస్తవనికి చాలా తేడా ఉందని అన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తున్నట్లు కేంద్రం చెబుతోందని.. కానీ వాస్తవానికి యువతకు ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని రాహుల్ విమర్శించారు. మేకిన్ ఇండియా, స్టార్టప్ ల వల్ల ఉద్యోగాలు రావడం లేదన్న రాహుల్.. ఒక్క 2021 ఏడాదిలోనే 3 కోట్ల ఉద్యోగాలు పోయాయని పేర్కొన్నారు. 50 ఏళ్లలో లేని విధంగా భారత్ నిరుద్యోగం ఎదుర్కొంటుందని..దేశవ్యాప్తంగా యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని రౌల్ గాంధీ అన్నారు. యూపీఏ హయాంలో 27 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పిన రాహుల్.. బీజేపీ హయాంలో 23 కోట్ల మంది తిరిగి పేదరికంలోకి వెళ్లారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

Also read: Mamata Banerjee: విచారణకు రావాలంటూ మమతా బెనర్జీకి ముంబై కోర్టు సమన్లు