Mamata Banerjee: విచారణకు రావాలంటూ మమతా బెనర్జీకి ముంబై కోర్టు సమన్లు

2021 డిసెంబర్ లో ముంబై పర్యటనకు వచ్చిన మమతా అధికారికంగా సీఎం హోదాలో లేరని ..అందువల్ల ఆమెపై చర్యలు తీసుకోక పోవడానికి కారణాలు ఏవీలేవని స్పష్టం చేసింది

Mamata Banerjee: విచారణకు రావాలంటూ మమతా బెనర్జీకి ముంబై కోర్టు సమన్లు

Mumbai Mamta

Mamata Banerjee: జాతీయ గీతాన్ని అగౌరవ పరిచిన ఘటనలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కోర్టు విచారణకు రావాలంటూ ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ ఆదేశించింది. మార్చి 2న చేపట్టనున్న విచారణకు ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాలని లేని పక్షంలో ఘటనను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2021 డిసెంబర్ లో ఓ కార్యక్రమానికి హాజరైయేందుకు ముంబైకి వచ్చారు. శివసేన, కాంగ్రెస్ నేతలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మమతా.. కార్యక్రమం అనంతరం జాతీయ గీతం ఆలపిస్తుండగా..మధ్యలోనే ఆపి.. వేదిక నుంచి తిగిపోయారు. ఈ ఘటన తాలూకు దృశ్యాలు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టగా.. సీఎం మమతా విమర్శల పాలయ్యారు.

Also Read: Viral Video: వంకర టింకరగా ల్యాండ్ అవబోయిన విమానం, తృటిలో తప్పిన పెనుప్రమాదం

ఆ దృశ్యాలను సేకరించిన.. బీజేపీ ముంబై యూనిట్ సభ్యుడు వివేకానంద గుప్తా..జాతీయ గీతాన్ని అగౌరవ పరిచిన సీఎం మమతాపై చర్యలు తీసుకోవాలంటూ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ ను ఆశ్రయించారు. వీడియో టేపులు, యూట్యూబ్ లింకులు సాక్ష్యంగా చూపి సీఎం మమతా పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశించాలంటూ కోర్టును కోరారు. వీడియోలను పరిశీలించిన ముంబై కోర్టు.. ఫిబ్రవరి 2న విచారణ చేపట్టింది. జాతీయ గీతాన్ని అగౌరవ పరిచిన వ్యక్తి సీఎం అయినా సరే శిక్షార్హులే అంటూ మేజిస్ట్రేట్ పేర్కొన్నారు.

Also read: Brave Man: తగలబడుతున్న లారీని సురక్షిత ప్రాంతానికి తరలించిన వ్యక్తి

ముంబై పర్యటనకు వచ్చిన మమతా అధికారికంగా సీఎం హోదాలో లేరని ..అందువల్ల ఆమెపై చర్యలు తీసుకోక పోవడానికి కారణాలు ఏవీలేవని స్పష్టం చేసింది. వీడియోలను పరిగణలోకి తీసుకున్న కోర్ట్.. జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం, 1971లోని సెక్షన్ 3 ప్రకారం నిందితురాలు శిక్షార్హమైన నేరానికి పాల్పడ్డారని వీడియోల ద్వారా రుజువైనట్లు పేర్కొన్నారు. తదుపరి విచారణ నిమిత్తం మార్చి 2న సీఎం మమతా బెనర్జీ న్యాయమూర్తి ఎదుట హాజరు కావాలంటూ ఆదేశించింది.

Also Read: Chinese brutality: కళ్ళకు గంతలు కట్టి, కరెంటు షాక్ ఇచ్చారు: అరుణాచల్ యువకుడు