Viral Video: వంకర టింకరగా ల్యాండ్ అవబోయిన విమానం, తృటిలో తప్పిన పెనుప్రమాదం

ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న విమానం ఒకటి.. కుదుపులకు గురై..ప్రమాద అంచుల దాకా వెళ్ళింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో తృటిలో పెనుప్రమాదం తప్పింది.

Viral Video: వంకర టింకరగా ల్యాండ్ అవబోయిన విమానం, తృటిలో తప్పిన పెనుప్రమాదం

British Airways

Viral Video: వొళ్ళు గగుర్పొడిచే విధంగా వెన్నులో పూసలు కదిలే దృశ్యం ఇది. ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న విమానం ఒకటి.. కుదుపులకు గురై..ప్రమాద అంచుల దాకా వెళ్ళింది. గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోయేలా తలపించిన ఈఘటనలో.. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో తృటిలో పెనుప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. వరుస తుఫానులు బ్రిటన్ లోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్నాయి. మలిక్, కార్రీగా నామకరణం చెందిన ఈ తుఫానుల ధాటికి భారీ ఆస్థి, ప్రాణ నష్టం వాటిల్లింది. సుమారు రెండు లక్షలకు పైగా గృహాలకు నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బీభత్సమైన గాలులు యూకే మొత్తాన్ని చుట్టేస్తున్నాయి. పెను గాలుల ధాటికి చెట్ల కొమ్మలు, ఇల్లు, రోడ్డుపై ఉన్న భారీ వాహనాలు సైతం ఎగిరిపడుతున్నాయి.

Also Read: Brave Man: తగలబడుతున్న లారీని సురక్షిత ప్రాంతానికి తరలించిన వ్యక్తి

ఈక్రమంలో జనవరి 31న బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందిన A321 విమానం ప్రయాణికులతో లండన్ లోని హీత్రూ విమానాశ్రయంలో ల్యాండ్ అయేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో బలమైన గాలులు వీయడంతో విమానం భారీ కుదుపులకు గురైంది. దీంతో పైలట్లు విమానాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించి తిరిగి ల్యాండ్ అయేందుకు ప్రయత్నించారు. గాలుల ధాటికి విమానం పక్కకు వొరిగి పోతుండడం గమనించిన పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి..విమానాన్ని తిరిగి గాల్లోకి తీసుకువెళ్లారు. పల్టీ కొట్టబోయిన విమానం..యధాతంగా ల్యాండ్ అయేందుకు ప్రయత్నించి ఉంటే.. ఎంత ప్రమాదం జరిగి ఉండేదో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది.

Also read: Chinese brutality: కళ్ళకు గంతలు కట్టి, కరెంటు షాక్ ఇచ్చారు: అరుణాచల్ యువకుడు

ఇక ఈ ఘటన తాలూకు దృశ్యాలు.. అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డు కాగా.. “బిగ్ జెట్ టీవీ” అనే ట్విట్టర్ ఖాతాదారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది చూసిన నెటిజన్లు.. సమయస్ఫూర్తితో వ్యవహరించి పెను ప్రమాదం నుంచి ప్రయాణికులను కాపాడిన పైలట్ల ను అభినందిస్తున్నారు. దీనిపై బ్రిటిష్ ఎయిర్ వేస్ సంస్థ స్పందిస్తూ.. తరచూ జరిగే ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడేలా తమ పైలట్లను సుశిక్షితుల్ని చేసినట్లు వివరించింది. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also read: Vijayawada Police: పీఆర్సీ ర్యాలీ నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపు