National Herald Case: నేడు ఈడీ ముందు హాజరుకానున్న రాహుల్ గాంధీ.. రాష్ట్రపతిని కలవనున్న కాంగ్రెస్ నేతలు

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ అధికారులు సోమవారం మరోసారి విచారించనున్నారు. ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు రాహుల్ ను ఈడీ అధికారులు విచారించిన విషయం విధితమే. తిరిగి 17న విచారణకు రావాలని ఆదేశించారు. అయితే కాంగ్రెస్ అధినేత్రి, రాహుల్ తల్లి సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సోమవారంకు విచారణ వాయిదా వేయాలని రాహుల్ కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు ఈడీ అధికారులు సోమవారం మరోసారి విచారణకు సిద్ధమయ్యారు.

National Herald Case: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ అధికారులు సోమవారం మరోసారి విచారించనున్నారు. ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు రాహుల్ ను ఈడీ అధికారులు విచారించిన విషయం విధితమే. తిరిగి 17న విచారణకు రావాలని ఆదేశించారు. అయితే కాంగ్రెస్ అధినేత్రి, రాహుల్ తల్లి సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సోమవారంకు విచారణ వాయిదా వేయాలని రాహుల్ కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు ఈడీ అధికారులు సోమవారం మరోసారి విచారణకు సిద్ధమయ్యారు. అయితే విచారణ సందర్భంగా రాహుల్ గాంధీ స్టేట్ మెంట్ ను పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద ఈడీ అధికారులు రికార్డు చేస్తున్నారు.

Rahul Gandhi : రాహుల్‌ విచారణ సోమవారానికి వాయిదా

ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు రాహుల్ గాంధీని మూడు రోజులు 30 గంటల పాటు విచారించారు. ఈరోజు నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులు వైఐఎల్ కి బదలాయింపు, షేర్ల వాటాలు,ఆర్ధిక లావాదేవీల అంశాలపై రాహుల్ ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తారని తెలుస్తోంది. ఇదే కేసులో జూన్ 23న ఈడీ ఎదుట కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా హాజరు కావాల్సి ఉంది. ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో సోనియాను ప్రస్తుతానికి విచారణ నుంచి అధికారులు మినహాయించారు. ఆమె కోలుకోగానే విచారించే అవకాశాలు ఉన్నాయి.

Rahul Gandi: మూడో రోజు ముగిసిన రాహుల్ ఈడీ విచారణ.. మళ్లీ ఎప్పుడు వెళ్లాలంటే..

ఇదిలాఉంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా, రాహుల్ గాంధీ పట్ల కేంద్రం కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలపనున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. నిరసనలు శాంతియుతంగా చేపట్టాలని ఆయన కోరారు. నిరసనలతో పాటు సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కాంగ్రెస్ నేతల బృందం కలవనుంది. రాహుల్ గాంధీ ఈడీ విచారణ, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, కాంగ్రెస్ ఎంపీలపై ఢిల్లీ పోలీసులు జరిపిన దాడులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు.

ట్రెండింగ్ వార్తలు