Rahul Gandi: మూడో రోజు ముగిసిన రాహుల్ ఈడీ విచారణ.. మళ్లీ ఎప్పుడు వెళ్లాలంటే..

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)విచారణ మూడో రోజు ముగిసింది. బుధవారం దాదాపు తొమ్మిది గంటల పాటు రాహుల్ గాంధీని అధికారులు విచారించారు. అయితే విచారణ పూర్తికాలేదని, మళ్లీ శుక్రవారం విచారణకు హాజరు కావాలని రాహుల్ గాంధీకి ఈడీ అధికారులు స్పష్టం చేశారు.

Rahul Gandi: మూడో రోజు ముగిసిన రాహుల్ ఈడీ విచారణ.. మళ్లీ ఎప్పుడు వెళ్లాలంటే..

Rahul Gandi

Rahul Gandi: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)విచారణ మూడో రోజు ముగిసింది. బుధవారం దాదాపు తొమ్మిది గంటల పాటు రాహుల్ గాంధీని అధికారులు విచారించారు. అయితే విచారణ పూర్తికాలేదని, మళ్లీ శుక్రవారం విచారణకు హాజరు కావాలని రాహుల్ గాంధీకి ఈడీ అధికారులు స్పష్టం చేశారు. రాహుల్ వెంట ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు.

Rahul Gandhi ED : నేషనల్ హెరాల్డ్ కేసు.. రాహుల్ గాంధీ తీరుపై ఈడీ అసంతృప్తి

రాహుల్ గాంధీని ఉదయం 11.30గంటలకు ప్రశ్నించడం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు నాలుగు గంటల విచారణ అనంతరం మధ్యాహ్నం 3.30గంటల ప్రాంతంలో రాహుల్ గాంధీ బయటకువచ్చి అర్ధగంట తర్వాత మళ్లీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే విచారణ పూర్తికాలేదని, మళ్లీ శుక్రవారం విచారణకు హాజరు కావాలని రాహుల్ గాంధీకి ఈడీ అధికారులు సూచించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఈడీ విచారణలో యంగ్ ఇండియన్ సంస్థ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని రాహుల్ చెప్పినట్లు సమాచారం. యంగ్ ఇండియన్ లిమిటెడ్ (వైఐఎల్) లాభాపేక్షలేని దాతృసంస్థ అని, అది కంపెనీల చట్టంలోని ప్రత్యేక నిబంధన కింద ఏర్పడిందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Rahul Gandhi: ఎనిమిదేళ్ళ క్రితమూ ఇలాగే ఉద్యోగాలపై హామీ ఇచ్చారు: రాహుల్ గాంధీ

అయితే రాహుల్ వాదనను ఈడీ అధికారులు తోసిపుచ్చుతూ 2010లో యంగ్ ఇండియా లిమిటెడ్ ఏర్పడినప్పటి నుండి ఎలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టలేదని పేర్కొన్నట్లు సమాచారం. యంగ్ ఇండియన్ ద్వారా ధార్మిక పనిచేసి ఉంటే అందుకు సంబంధించిన పత్రాలు లేదా ఆధారాలు సమర్పించాలని అధికారులు రాహుల్ గాంధీని కోరినట్లు తెలిసింది. మరోవైపు రాహుల్ గాంధీని ఈడీ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనకారులను అడ్డుకునే క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వివాదం, ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.