Rahul Gandhi: ఎనిమిదేళ్ళ క్రితమూ ఇలాగే ఉద్యోగాలపై హామీ ఇచ్చారు: రాహుల్ గాంధీ

దేశంలో ఏడాదిన్న‌ర‌లో యుద్ధ ప్రాతిపదికన 10 ల‌క్ష‌ల ఉద్యోగ నియామ‌కాలు చేప‌ట్టాల‌ని ప‌లు ప్ర‌భుత్వ విభాగాల‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సూచించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు.

Rahul Gandhi: ఎనిమిదేళ్ళ క్రితమూ ఇలాగే ఉద్యోగాలపై హామీ ఇచ్చారు: రాహుల్ గాంధీ

Rahul Gandhi

Rahul Gandhi: దేశంలో ఏడాదిన్న‌ర‌లో యుద్ధ ప్రాతిపదికన 10 ల‌క్ష‌ల ఉద్యోగ నియామ‌కాలు చేప‌ట్టాల‌ని ప‌లు ప్ర‌భుత్వ విభాగాల‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సూచించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. ”ఎనిమిదేళ్ళ క్రితం ఇలాగే ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తామ‌ని యువ‌త‌కు హామీ ఇచ్చారు. ఇప్పుడు 10 ల‌క్ష‌ల ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నారు. ఇది జుమ్లా (న‌కిలీ హామీల) ప్ర‌భుత్వం కాదు.. మ‌హా జుమ్లాల ప్ర‌భుత్వం. ఉద్యోగాలు సృష్టించ‌డంలో మ‌న ప్ర‌ధాని నిష్ణాతుడు కాదు.. కానీ, ఉద్యోగాల‌పై వార్త‌లు సృష్టించడంలో మాత్రం నిష్ణాతుడు” అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.

Modi Brother: ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకం, ప్రధానికి కాదు – ప్రహ్లాద్ మోదీ

మరోవైపు, రాహుల్ గాంధీ స్పందించిన తీరుపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమ‌ర్శ‌లు గుప్పించారు. యువ‌త‌కు ఏడాదిన్న‌ర‌లో 10 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇస్తామంటూ ప్ర‌ధాని మోదీ చేసిన ప్ర‌క‌ట‌న‌ను రాహుల్ గాంధీ స్వాగ‌తిస్తార‌ని తాను అనుకున్నాన‌ని చెప్పారు. అయితే, అలా చేయ‌కుండా ఇత‌ర విష‌యాల‌ను ప్ర‌స్తావించడంలో రాహుల్ చాలా బిజీగా ఉన్నార‌ని విమ‌ర్శించారు.