Modi Brother: ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకం, ప్రధానికి కాదు – ప్రహ్లాద్ మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ నిరసన వ్యక్తం చేయడానికి ఢిల్లీకి బయల్దేరనున్నారు. కమీషన్ రేటును కేంద్ర ప్రభుత్వం పెంచాలని, నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టనున్నారు.

Modi Brother: ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకం, ప్రధానికి కాదు – ప్రహ్లాద్ మోదీ

Pm Modi (3)

 

 

Modi Brother: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ నిరసన వ్యక్తం చేయడానికి ఢిల్లీకి బయల్దేరనున్నారు. కమీషన్ రేటును కేంద్ర ప్రభుత్వం పెంచాలని, నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టనున్నారు. ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన యాత్ర జరగనుంది.

దానికి వైస్ ప్రెసిడెంట్ అయిన ప్రహ్లాద్ మోదీ.. జులై నాటికి ఆర్గనైజేషన్ల డిమాండ్లు పూర్తి చేయకపోతే ఆగష్టు2న నిరసన జరుపుతామని అంటున్నారు. రామలీలా మైదాన్ లో మొదలుపెట్టి పార్లమెంట్ వరకూ నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు.

సరసమైన ధరల దుకాణాలు (FPS) అంటే బియ్యం, గోధుమలు వంటి నిత్యావసర వస్తువులను ఇతర వస్తువులతో పాటు రేషన్-కార్డు హోల్డర్లకు పంపిణీ చేయడానికి లైసెన్స్ తో నడిచేవే.

Read Also: ఏడాదిన్నరలో 10లక్షల మందికి ఉద్యోగాలివ్వాలి – మోదీ

దాదాపు 10 ఏళ్లుగా అధిక కమీషన్ కోసం డిమాండ్‌ను చేస్తున్నామని ఫెడరేషన్ కో-ప్రెసిడెంట్ కాళీ చరణ్ గుప్తా మీడియాతో అన్నారు. “1 కిలోగ్రాము రేషన్‌పై 70 పైసల కమీషన్ వచ్చేది. దానిని 90 పైసలు పెంచారు. అదే మాకు రూ.4 కమీషన్ రావాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని తెలిపారు.

అన్ని రాష్ట్రాల్లోని FPS యజమానులకు ఒకేరీతిలో కమీషన్‌ను ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.

అహ్మదాబాద్‌లో స్వయంగా రేషన్ దుకాణం ఉన్న మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ.. తాను నిరసన చేస్తున్నది తన సోదరుడిపై కాదని, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాత్రమేనని చెప్పారు.