Platform Charges: రైల్వే ప్రయాణికులకు షాక్.. ప్లాట్‌ ఫాం చార్జీలు పెరిగాయి

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు భారీ షాక్‌ ఇచ్చింది. కొవిడ్‌ నియంత్రణ పేరుతో ప్లాట్ ఫాం చార్జీలను భారీగా పెంచేసింది.

Railway platform charges : దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు భారీ షాక్‌ ఇచ్చింది. కొవిడ్‌ నియంత్రణ పేరుతో ప్లాట్ ఫాం చార్జీలను భారీగా పెంచేసింది. ఈ మేరకు సోమవారం దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. రూ.30 నుంచి రూ.50కి పెంచినట్లు ఎస్‌సీఆర్‌ జనరల్‌ మేనేజర్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎక్కువ మంది ప్రయాణికులు రైల్వే ప్లాట్‌ఫాంల్లో రద్దీని నియంత్రించడం కోసమే చార్జీలు పెంచినట్టు తెలిపారు. పెరిగిన చార్జీలు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించారు. ముందుగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ రూ.50 వసూలు చేస్తామని అన్నారు. మిగిలిన రైల్వే స్టేషన్లకు సంబంధించి ప్లాట్ ఫాం చార్జీలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు