Inidan Railways Amrit Bharat scheme : చిన్న రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్

చిన్న రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని భారత రైల్వే శాఖ నిర్ణయించింది. స్టేషన్ రీ డెవలప్ మెంట్ డ్రైవ్ లో భాగంగా రానున్న రోజుల్లో 1,000 చిన్న రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని నిర్ణయించింది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పేరుతో ఆయా రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలను కల్పించటం..ఆధునీకరించనున్నారు.

Inidan Railways Amrit Bharat scheme : చిన్న రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని భారత రైల్వే శాఖ నిర్ణయించింది. స్టేషన్ రీ డెవలప్ మెంట్ డ్రైవ్ లో భాగంగా రానున్న రోజుల్లో 1,000 చిన్న రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని నిర్ణయించింది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పేరుతో ఆయా రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలను కల్పించటం..ఆధునీకరించనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన చిన్న రైల్వేస్టేషన్లను ఆధునికీకరించనుంది రైల్వే శాఖ. ఇప్పటికే ఈ పథకం కింద ఒడిశాలోని ఖుర్దా జంక్షన్‌ను అభివృద్ధి చేసింది రైల్వే శాఖ.

ఈ పథకంలో భాగంగా.. స్టేషన్ లో ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లు ఖర్చు చేయనుంది కేంద్రం. సంవత్సరం లేదా సంవత్సరన్నర వ్యవధిలో ఈ అభివృద్ది పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దశలవారీగా జరిగనున్న అభివృద్ధిలో భాగంగా రూఫ్ టాప్ ప్లాజాలు, పొడవైన ప్లాట్ ఫారములు, బ్యాలస్ట్ లెస్ ట్రాకులు వంటివి ఉంటాయి.

రైల్వేలోని 68 డివిజన్ల పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న 200 ప్రధాన రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు అదనంగా చిన్న స్టేషన్లను కూడా అభివృద్ధి చేయనుంది రైల్వే శాఖ. స్టేషన్లలో దశలవారీగా సౌకర్యాలను మెరుగుపరచడం, హై లెవల్ ప్లాట్ ఫారమ్ లు, వెయిటింగ్ రూమ్ ల ఏర్పాటు వంటివి జరుగుతాయి. అలాగే స్టేషన్‌ బయట ఓ ప్లాన్ ప్రకారంగా వాహనాల పార్కింగ్ ప్లేస్ తో పాటు లైటింగ్‌ వ్యవస్థను మెరుగుపర్చడం, రైళ్ల రాకపోకలను తెలిపే డిజిటల్‌ బోర్డులు, దివ్యాంగులకు అవసరమైన సౌకర్యాలు వంటి ఆధునీకరణ జరుగనున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పేరుతో జరుగనున్న ఈ పథకంతో ఇక భారత్ లో చిన్న స్టేషన్లలో ఇబ్బందులు తప్పనున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు