గుజ్జర్లకు 5శాతం రిజర్వేషన్లు.. బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

గుజ్జర్లు చేపట్టిన దీక్ష పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. గుజ్జర్లకు విద్య, ఉద్యోగాల్లో 5శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును బుధవారం(ఫిబ్రవరి-13,2019) ఆ రాష్ట్ర మంత్రి కల్లా శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ సవరణ బిల్లు2019 పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లులో మరనో నాలుగు కులాలను కూడా చేర్చారు.
విద్య, ఉద్యోగాల్లో 5శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నుంచి గుజ్జర్ల నేత కిరోరి సింగ్ భైంస్లా, ఆయన మద్దతుదారులు సవాయ్ జిల్లాలోని మాధోపూర్ జిల్లాలో రైలు పట్టాలపై భైఠాయించి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం వీరి నిరసన హింసాత్మకంగా మారింది. ఈ సమయంలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్ కు ఓకే చెప్పింది.