Rajasthan Curfew Imposed In 10 Jodhpur Areas After Eid Clashes
Rajasthan Curfew : రాజస్థాన్ రాష్ట్రంలోని జోద్‌పూర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈద్ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జోద్‌పూర్ లోని 10 పోలీస్‌స్టేషన్ల పరిధిలో పోలీస్ యంత్రాంగం కర్ఫ్యూ విధించింది. మే 4వ తేదీ (రేపు) అర్ధరాత్రి 12 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని జోధ్‌పూర్ డిప్యూటీ కమిషనర్ రాజ్‌కుమార్ చౌదరి ఆదేశాలు జారీ చేశారు. జోద్ పూర్ జిల్లాలోని 10 పోలీసు స్టేషన్ పరిధిలో సదర్‌కోత్వాలి, ఉదయమందిర్, సదర్‌బజార్ నగోరి గేట్, ఖండఫల్సా, ప్రతాప్‌నగర్, సుర్‌సాగర్, సర్దార్‌పురా పోలీస్ స్టేషన్, ప్రతాప్‌నగర్ సదర్ దేవ్‌నగర్ పరిధిలో కర్ఫ్యూను విధించారు.
ఇరువర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో ఉద్రిక్తతలు కొనసొగుతున్నాయి. దాంతో జోధ్‌పూర్‌లోని మార్కెట్‌లన్నీ మూతపడ్డాయి. జలోరి గేట్ వద్ద పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. పలు ప్రదేశాల్లో నినాదాలు, గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. జోద్ పూర్ ఘటనపై రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ పాలనలో ఔరంగజేబీ మనస్తత్వం ఎలా ప్రబలంగా మారిందో జోధ్‌పూర్ ఘటనతో తేలిపోయిందన్నారు.
Rajasthan Curfew Imposed In 10 Jodhpur Areas After Eid Clashes
స్వాతంత్య్ర సమరయోధుడు బల్ముకుంద్ బిస్సా విగ్రహం నుంచి జెండాను దించి జలోరీ గేట్ వద్ద ప్రత్యేక జెండాను ఆవిష్కరించడం, రాళ్లదాడికి పాల్పడటం అనేది అధికార రక్షణ లేకుండా సాధ్యం పడదని ఆయన ట్వీట్ చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. జోధ్‌పూర్‌లో కొందరు ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. శాంతిభద్రతలు కాపాడాలని గెహ్లాట్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హింసాత్మక ఘటనలో రాజస్థాన్ పోలీసులు ముగ్గురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
Read Also : Rajasthan : డ్యాన్సులు వేస్తూ హోళీ సంబరాలు చేసుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు