Rajasthan :‘‘అత్యాచారాలలో రాజస్థాన్ నెంబర్ 1 నో డౌట్..ఎందుకంటే ఇది పురుషుల రాష్ట్రం కాబట్టి’’:అసెంబ్లీలో మంత్రి

‘అత్యాచారాల్లో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది..దీంట్లో ఎటువంటి సందేహం లేదు.. ఎందుకంటే రాజస్థాన్ పురుష రాష్ట్రం’’అంటూ మంత్రి శాంతి ధరివాల్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.

Rajasthan No 1 in rape cases because its a state of men : రాజస్థాన్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శాంతి ధరివాల్ సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా బుధవారం (మార్చి 9,2022) తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అత్యాచారాల్లో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది..దీంట్లో ఎటువంటి సందేహం లేదు.. ఎందుకంటే రాజస్థాన్ పురుష రాష్ట్రం’’అంటూ అసెంబ్లీలోనే వ్యాఖ్యానించారు. ఏకంగా రాష్ట్ర శాసనసభలోనే ఆయన ఇలా మాట్లాడటంతో ప్రతిపక్ష బీజేపీ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.

Also read : AAP in Punjab: పంజాబ్ ను కైవసం చేసుకున్న “ఆమ్ ఆద్మీ”: సక్సెస్ సీక్రెట్

మంత్రి శాంతి ధరివాల్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ మంత్రి రాష్ట్రం అత్యాచారాల్లో నంబర్ 1లో ఉందని గర్వంగా చెప్పుకుంటున్నారా? ఇది మీకు జుగప్పాకరంగా అనిపించటంలేదా? అని ప్రశ్నించారు.‘‘మనం రేప్ లలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాము. ఇందులో సందేహం అక్కర్లేదు. ఎందుకని అత్యాచారాల్లో ముందున్నాం? రాజస్థాన్ పురుషుల రాష్ట్రం కాబట్టి’’ అని ఆయన అన్నారు. మంత్రి వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది.

‘‘మంత్రి శాంతి ధరివాల్ వ్యాఖ్యలపై బీజేపీ అధికారా ప్రతినిధి షెహ్ జాద్ మాట్లాడుతూ..అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ మంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అసహ్యకరంగా ఉన్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అత్యాచారాన్ని ధరివాల్ చట్టబద్ధం చేసేట్టు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.

Also read : Vani Viswanath : ‘వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేసి తీరుతా..ఇది పక్కా’ : నటి వాణీవిశ్వనాథ్

‘మంత్రి శాంతి ధరివాల్ అత్యాచారం వ్యాఖ్యలపై మరో బీజేపీ నేత సతీష్ పూనియా మాట్లాడుతూ..‘‘రాష్ట్రంలో అత్యాచారాల్లో నంబర్‌వన్‌గా ఉన్నామంటూ సిగ్గు లేకుండా ఒప్పుకోవడం, మగవారి వేషధారణలో మహిళలను ఉద్దేశించి మాట్లాడడం రాష్ట్రంలోని మహిళలను అవమానించడమే కాకుండా పురుషుల గౌరవాన్ని దిగజార్చడమే కాదు.. ప్రియాంక గాంధీ ఇప్పుడు ఏం చెబుతావు, ఏం చేస్తావు?” అంటూ ప్రశ్నించారు. మంత్రులే ఇలా మాట్లాడుతుంటే రాష్ట్రంలో మహిళలు తమకు భద్రత ఉందని ఎలా అనుకోగలరని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ ప్రశ్నించారు.

 

 

ట్రెండింగ్ వార్తలు