Rajasthan Police: నకిలీ వార్తల కట్టడిపై రాజస్థాన్ పోలీసుల వినూత్న ప్రచారం

ఫిబ్రవరి 7న ప్రారంభమైన వాలెంటైన్ వీక్ సందర్భంగా రాజస్థాన్ పోలీసులు రోజుకో విశిష్టతను తెలిపేలా నకిలీ వార్తలపై అవగాహన కల్పిస్తున్నారు.

Rajasthan Police: ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ.. శాంతి భద్రతలకు సవాలుగా మారిన నకిలీ వార్తల కట్టడికి పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఇప్పుడిప్పుడే సత్ఫలితాన్నిస్తున్నాయి. ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా నకిలీ వార్తల కట్టడికి పోలీసులు కృషి చేస్తున్నారు. నకిలీ వార్తల కట్టడికి రాజస్థాన్ పోలీసులు వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించేలా పోలీసులు చేస్తున్న ప్రచారాలు ఆకట్టుకుంటున్నాయి. ఫిబ్రవరి రెండో వారం “వాలెంటైన్ వీక్” సందర్భంగా రోజుకో విశిష్టతను చాటుతూ రాజస్థాన్ పోలీసులు ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు.

Also read: Rahul Gandhi: మోదీ “గోవా విమోచన” వ్యాఖ్యలపై రాహుల్ ఫైర్

ప్రేమికుల దినోత్సవంలో భాగంగా జరుపుకునే “వాలెంటైన్ వీక్”లో యువతీ యువకులు రోజుకో పేరుతో తమ ప్రేమను వ్యక్త పరుస్తుంటారు. కొన్నేళ్ల క్రితమే ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ “వాలెంటైన్ వీక్”లో ప్రేమికులే కాకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు, జీవిత భాగస్వామ్యులు సైతం ఒకరిపై మరొకరు తమ ఫీలింగ్స్ తెలుపుకుంటారు. రోజ్ డే, ప్రొపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే మరియు కిస్ డే చివరగా వాలెంటైన్స్ డే జరుపుకుంటారు. ఫిబ్రవరి 7న ప్రారంభమైన వాలెంటైన్ వీక్ సందర్భంగా రాజస్థాన్ పోలీసులు రోజుకో విశిష్టతను తెలిపేలా నకిలీ వార్తలపై అవగాహన కల్పిస్తున్నారు.

Also read: China Fishing Vessels: హిందూమహా సముద్రంలో అక్రమంగా చైనా చేపల వేట

రోజ్ డే సందర్భంగా చేపట్టిన ప్రచారంలో “గులాబీ సువాసనను వ్యాపింపజేయండి, ముళ్ల లాంటి ఫేక్ న్యూస్ ఫార్వార్డ్ చేయకండి” అంటూ రాజస్థాన్ పోలీసులు ప్రచారం చేపట్టారు. ఇక ప్రొపోజ్ డే నాడు.. “మెస్సేజ్ పరిగణించే ముందు దాని మూలాన్ని పరిగణించండి, క్రాస్-చెక్ చేయండి, తేదీని తనిఖీ చేయండి” అంటూ అవగాహన కల్పించారు. చాక్లెట్ డే నాడు “తప్పుడు వార్తలను అరికట్టండి, ఆలస్యం చేయకండి” అంటూ పేర్కొన్న పోలీసులు.. టెడ్డి డే నాడు.. నిజాలు తనిఖీ చేసే వెబ్‌సైట్‌ల పేర్లను తమ సోషల్ మీడియా ఖాతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచారు. వాస్తవ వార్తలు సమాజంలో ఎంత ప్రభావం చూపుతున్నాయి నకిలీ వార్తలు అంతే దుష్ప్రభావం చూపుతున్నాయి. దీంతో నకిలీ వార్తల కట్టడికి పోలీసులు, స్వచ్చంద సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

Also read: Honda CBR150R: మరోసారి భారత మార్కెట్లోకి CBR150R బైక్ ను తెస్తున్న హోండా

ట్రెండింగ్ వార్తలు