మహారాష్ట్రలోని ప్రభుత్వం రెండు మూడు నెలల్లో పడిపోతుంది: రామ్‌దాస్ అథవాలే

  • Publish Date - July 16, 2020 / 12:48 PM IST

రాజస్థాన్ రాజకీయ నాటకం ఇంకా ముగియలేదు. ఇంతలోనే కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్విలను ఏర్పటు చేస్తున్న బీజేపీ మరో రాష్ట్రప్రభుత్వంపై కన్నేసినట్లుగా తెలుస్తుంది. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ భవిష్యత్తు గురించి మాట్లాడడమే ఇందుకు కారణం. రాబోయే రెండు, మూడు నెలల్లో మహారాష్ట్రలో రాజకీయ తిరుగుబాటు జరగవచ్చని కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే అన్నారు.

రాబోయే మూడు నెలల్లో మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం పతనం అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్‌సిపి సంకీర్ణ ప్రభుత్వం పడిపోతుందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు అథవాలే చెప్పారు. ఆయన ప్రకారం బీజేపీ నాయకత్వంలో మరోసారి ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని. రాజస్థాన్‌లో రాజకీయల గురించి వ్యాఖ్యానిస్తూ రామ్‌దాస్ అథవాలే.. మహారాష్ట్రలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాజస్థాన్ తరువాత మహారాష్ట్ర ఉంటుందని చెప్పారు.

సచిన్ పైలట్‌కు మద్దతుగా రామ్‌దాస్ అథవాలే:
రామ్‌దాస్ అథవాలే మాట్లాడుతూ.. ‘మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పడిపోవచ్చునని, రెండు, మూడు నెలల్లో తిరుగుబాటు ఉండవచ్చు’ అని అభిప్రాయపడ్డారు. రాజస్థాన్‌లో సచిన్ పైలట్ కాంగ్రెస్‌తో తిరుగుబాటు చేయడాన్ని మంత్రి రామ్‌దాస్ అథవాలే సమర్థించారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ పనితీరుపై సచిన్ పైలట్ అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని మోడీ నాయకత్వంలో రాజస్థాన్ అభివృద్ధికి సచిన్ పైలట్ ముందుకు సాగాలని అన్నారు.

బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర విదేశాంగ మంత్రి రామ్‌దాస్ అథవాలే శరద్ పవార్‌కు సూచించారు. శివసేన ప్రభుత్వం నుంచి మద్దతు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్ మహారాష్ట్రలోని బిజెపి, ఆర్‌పిఐ(ఎ) తో సహకరించాలని అథవాలే అభిప్రాయపడ్డారు. ఇది మహారాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో డబ్బును అందించచడానికి సహాయపడుతుంది అని అన్నారు.