Fighter jet tyre Theft : ఏకంగా..యుద్ధ విమానం టైర్‌ను దొంగిలించిన దుండగులు

ఏకంగా..యుద్ధ విమానం టైర్‌ను దొంగిలించుకుపోయారు దుండగులు. మిరాజ్-2000 ఫైటర్ జెట్ విమానం టైర్ ను దోచుకుపోయారు.

Mirage 2000 Fighter Jet Tyre Theft

Mirage-2000 fighter jet tyre Theft : దొంగలు ఎంతకు తెగించారంటే ఏకంగా భారత యుద్ధ విమానం టైరునే దోచుకుపోయారు. రాజస్థాన్‌లోని లక్నో బక్షి-కా-తలాబ్ ఎయిర్‌బేస్ ఎయిర్‌బేస్‌ (IAF) నుంచి జోధ్‌పూర్‌ ఎయిర్‌బేస్‌కు యుద్ధ విమానాన్ని తరలిస్తుండగా..ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకున్న ట్రక్కు నుంచి యుద్ధ విమానం టైర్‌ను దొంగిలించుకుపోయారు దుండగులు. రాజస్థాన్ నుంచి జోధ్‌పూర్‌ కు మిరాజ్-2000 ఫైటర్ జెట్ ఆరు కొత్త టైర్లను రవాణా చేస్తున్నప్పుడు టైర్లు ఉన్న ట్రక్కు అర్ధరాత్రి 12.30- 1 గంట సమయంలో ట్రాఫిక్ జాబ్ లో చిక్కుకుంది. అదే అదనుగా భావించిన దుండగులు ఉత్తరప్రదేశ్ రాజధానిలోని షహీద్ పాత్ వద్ద టైర్ ను దోచేశారు.

Read more :  UK Sotrovimab : ఒమిక్రాన్ ప్రభావవంతంగా పనిచేసే మెడిసిన్ గుర్తించిన బ్రిటన్..79 శాతం తగ్గిస్తుందని పరిశోధనలో వెల్లడి

గత శనివారం (నవంబర్ 27,2021) జరిగిన ఈ చోరీపై కేసు నమోదు చేశారు అధికారులు. ట్రక్కు డ్రైవర్ ఆషియానా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టారు. యుద్ధ విమానం టైర్లు ఉన్న ట్రక్కు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ లో చిక్కుకున్న సమయంలో ట్రాఫిక్ కదలికను బట్టి నెమ్మదిగా ముందుకు కదులుతున్న సమయంలో స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు చాకచక్యంగా టైరును అపహరించారు.

కాగా దొంగలు టైరును కట్టేందుకు ఉపయోగించే పట్టీని ధ్వంసంచేసి చోరీకి పాల్పడ్డారని ట్రక్‌ డ్రైవర్‌ చెబుతున్న వివరాలను నోట్ చేసుకున్న పోలీసులు షహీద్‌ మార్గంలోని CCTV పుటేజీలన్నింటినీ పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డీసీపీ ఈస్ట్ అమిత్ కుమార్ తెలిపారు.

Read more : COVID-19 Cases In India : దేశంలో పెరిగిన యాక్టివ్ కోవిడ్ కేసులు

కాగా ట్రక్కులో యుద్ధవిమానంతో పాటు విమానాల్లో ఇంధనం నింపే రీఫ్యూల్లర్‌ వెహికల్‌, యూనివర్సల్‌ ట్రాలీ, పెద్ద నిచ్చెన, ఎయిర్‌క్రాఫ్ట్‌ టైర్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.