COVID-19 Cases In India : దేశంలో పెరిగిన యాక్టివ్ కోవిడ్ కేసులు

: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 9216మందికి కరోనా సోకగా,మొత్తం కేసుల సంఖ్య 3,46,15,757కు చేరింది. గత 24 గంటల్లో 391 కరోనా మరణాలు నమోదుకాగా,ఇప్పటివరకు

COVID-19 Cases In India : దేశంలో పెరిగిన యాక్టివ్ కోవిడ్ కేసులు

Covid

Updated On : December 3, 2021 / 11:21 AM IST

COVID-19 Cases In India : దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 9216మందికి కరోనా సోకగా,మొత్తం కేసుల సంఖ్య 3,46,15,757కు చేరింది. గత 24 గంటల్లో 391 కరోనా మరణాలు నమోదుకాగా,ఇప్పటివరకు నమోదైన కోవిడ్ మరణాల సంఖ్య 4,70,115కి చేరింది. శుక్రవారం అప్ డేట్ చేయబడిన కేంద్ర ఆరోగ్యశాఖ డేటా ప్రకారం..దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 99,976కి పెరగింది.

దేశంలో రోజువారీ కొత్త కేసులు వరుసగా 159వ రోజు 50 వేల కన్నా తక్కువగా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.80శాతంగా ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలోని యాక్టివ్ కోవిడ్ కేసులు..మొత్తం కేసుల్లోని 0.29శాతమని తెలిపింది. గతేడాది మార్చి నుంచి కూడా ఇది అత్యల్పమని తెలిపింది. దేశవ్యాప్త కోవిడ్ రికవరీ రేటు 98.35శాతంగా ఉన్నట్లు తెలిపింది.

మరోవైపు, దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. గురువారం 73,67,230 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయగా, దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 1,25,75,05,514కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

ALSO READ Omicron : రాజస్తాన్ లో ఒమిక్రాన్ కలకలం..దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన కుటుంబం మొత్తానికి కరోనా