rajasthan women fight crocodile save husband life
Rajasthan : మొసలి నోటికి చిక్కిన భర్త ప్రాణాలు కాపాడుకున్న వీర నారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాహేసి నీరు తాగుతున్న యువకుడిపై అమాంతం నీటిలోంచి వచ్చిన మొసలి నోటకరుచుకుని నీటిలోకి లాక్కుపోయింది. అతను పెద్ద పెద్దగా కేకలు వేయటంతో పరుగున వచ్చి చూడగా మొసలినోటిలో చిక్కుకున్న భర్తను చూసి హడలిపోయింది. అంతే ఏమాత్రం ఆలోచించుకుండా నదిలోకి దూకి మొసలితో తన ప్రాణాలకు తెగించి పోరాడి భర్త ప్రాణాలు కాపాడుకుంది రాజస్థాన్ లో ఓ మహిళ.
రాజస్థాన్ లోని కరౌలీ జిల్లాలో చంబల్ నది తీరాన బనీసింగ్ మీనా అనే 29 యువకుడు మంగళవారం (ఏప్రిల్ 2023) మేకల్ని మేపటానికి వెళ్లాడు. మేత మేసాక తన మేకల్ని నదిలో నీరు తాగించటానికి తోలుకెళ్లారు. ఓ పక్క మేకలు నీరు తాగుతున్నాయి. తనకు కూడా దాహంగా ఉండటంతో తాను కూడా నదిలో దిగి నీరు తాగుతున్నాడు. అంతలో నీటిలోంచి వచ్చిన మొసలి బనీసింగ్ పై దాడి చేసింది. నోటకరుకుని లాక్కుపోవటానికి యత్నించిది. ఊహించని ఈ ఘటనకు భయంతో బనీసింగ్ పెద్ద పెద్దగా కేకలు వేశాడు.
అక్కడికి కాస్త దూరంలో ఉన్న బనీసింగ్ భార్య విమలాబాయి భర్త కేకలు విని పరుగున వచ్చింది. అక్కడి పరిస్థితిని చూసి హడలిపోయింది. అంతే తన ప్రాణాలకు తెగించి నదిలోకి దూకింది. చేతిలో ఉన్న కర్రతో తలపై బలంగా పదే పదే బాదింది. విమలాబాయి కొట్టే దెబ్బలకు మొసలికి దిమ్మతిరిగిపోయింది. బనీసింగ్ కాలు వదిలేసి మొసలి నీటిలోకి వెళ్లిపోయింది. ఇంతలో వీరి కేకలు విన్న చుట్టుపక్కల గొర్రెలు మేపుతున్న వారంతా అక్కడికి చేరుకొన్నారు. వెంటనే మొసలిదాడిలో గాయపడిన బనీసింగ్ ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ భయానక ఘటనపై బనీసింగ్ మాట్లాడుతు..నా భార్య చేసిన సాహసం వల్ల మృత్యువు వెంట్రుకవాసిలో తప్పిందంటూ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. నా భార్య తన ప్రాణాలకు తెగించి నన్ను కాపాడింది..లేదంటే నేను మొసలికి ఆహారమైపోయేవాడిని అంటూ మొసలిదాడి ఘటనను తలచుకుని భయపడిపోయాడు బనీసింగ్.
దీనిపై బనీసింగ్ భార్య విమలాబాయి మాట్లాడుతు..మొసలినోటిలో ఉన్ నా భర్త కాలుమాత్రమే నాకు కనపించింది. ఆ సమయంలో నాకు ఏమవుతుందోనని ఆలోచన కూడా నాకు రాలేదు. మృత్యువుతో పోరాడుతున్న నా భర్తను కాపాడుకోవాలని మాత్రమే అనిపించింది. ఏం చేస్తున్నానో అని కూడా ఆలోచించలేదు..ఎవరినన్నా పిలవాలనే ఆలోచన కూడా లేదు. అలా చేతిలో కర్రతోనే భర్తను కాపాడుకోవాలనే తపనే నాకు భయం కలగలేదని తెలిపింది. అలా మొసలితో పోరాడి భర్తను కాపాడుకున్న వీరనారి విమలాభాయి అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.