ట్రాఫిక్ రూల్స్ : దేవుడి దగ్గరికి వెళ్తారా…దేవుడినే రప్పించుకుంటారా!

కొత్తగా తీసుకొచ్చిన ట్రాఫిక్ రూల్స్ కారణంగా నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు భారీగా జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే దేవుడే మీ దగ్గరకి వస్తాడు..లేకుంటే మీరే దేవుడి దగ్గరకి వెళ్తారు అంటూ… ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గుజరాత్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. వినాయకుడి గెటప్ వేసుకున్న ఇద్దరు పోలీసులను రాజ్ కోట్ పోలీసులు రంగంలోకి దించారు.

హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్న వాహనదారులను ఆపి వారికి నోట్లె లడ్డూలు పెట్టారు వినాయకుడి గెటప్ లోని పోలీసులు. ఒక నిమిషం వాహనాదారులను ఆపి వారికి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. పోలీసులు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమంపై వాహనదారులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల్లో మరింతగా ట్రాఫిక్ నిబంధనలపై అవకాశం కల్పించాల్సి ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు.

దేశవ్యప్తంగా సెప్టెంబర్ -1నుంచి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి భారీగా ట్రాఫిక్ ఫైన్ లు వేస్తున్న విషయం తెలిసిందే. పలు చోట్ల ట్రాఫిక్ పోలీసులు విధించిన జరిమానా కట్టలేక పలువురు తమ వాహనాలను తగులబెట్టుకుంటుండగా మరికొందరు వాహనాలు వదిలేసి వెళ్లిపోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. అయితే ట్రాఫిక్ జరిమానాలు భారీగా విధించే ముందు రోడ్డు సరిగ్గా ఉండాలని, రోడ్లపై గుంతల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని..ముందు వీటిని సరి చేసి అప్పుడు ఫైన్ లు విధించండి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.