×
Ad

Ayodhya Ram temple : రామమందిరం నిర్మాణంతో అయోధ్యలో భూముల ధరలకు రెక్కలు

రామజన్మభూమి అయిన అయోధ్య నగరంలో రామాలయం నిర్మాణం పూర్తికానుండటంతో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రామాలయం ప్రతిష్ఠాపనకు పవిత్ర అయోధ్య నగరం సిద్ధమవుతున్న తరుణంలో రియల్ బూమ్ ఏర్పడింది....

  • Published On : December 10, 2023 / 07:32 AM IST

Ayodhya Ram temple

Ayodhya Ram temple : రామజన్మభూమి అయిన అయోధ్య నగరంలో రామాలయం నిర్మాణం పూర్తికానుండటంతో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రామాలయం ప్రతిష్ఠాపనకు పవిత్ర అయోధ్య నగరం సిద్ధమవుతున్న తరుణంలో రియల్ బూమ్ ఏర్పడింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా అయోధ్య నగరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్ ఆదాయం 109.19 శాతం పెరిగింది. రిజిస్ట్రేషన్ ఆదాయంలో యూపీలోనే అయోధ్య అగ్రస్థానంలో నిలిచిందని అయోధ్యలోని స్టాంపు మరియు రిజిస్ట్రేషన్ శాఖ అసిస్టెంట్ కమీషనర్ యోగేంద్ర ప్రతాప్ సింగ్ చెప్పారు.

అయోధ్యలో పెరిగిన వసతి ఖర్చులు

వచ్చే ఏడాది జనవరి 22వతేదీన రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుండటంతో అయోధ్యలోని 15 కిలోమీటర్ల చుట్టుపక్కల చదరపు అడుగు ధర రూ.3వేల నుంచి 15వేల రూపాయలు పలుకుతోంది. భూముల ధరలు మరింత పెరగవచ్చని అయోధ్య నగరానికి చెందిన ఓ బిల్డర్ చెప్పారు. రామాలయం ప్రారంభానికి మరో 42 రోజుల సమయం ఉండగానే అయోధ్యలో భక్తుల వసతి ఖర్చు పెరిగింది.

అయోధ్యలో రియల్ బూమ్

2019వ సంవత్సరంలో ఆలయ నిర్మాణానికి ముందు ఉన్న భూముల ధర కంటే 20 శాతం పెరిగాయని అయోధ్యకు చెందిన మరో రియల్టర్ చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు, అయోధ్యలో ఆలయ నిర్మాణం రియల్ ఎస్టేట్ బూమ్ తెచ్చిందని స్థానిక బిల్డర్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబరు మధ్య అయోధ్యలో 29,325 భూముల సేల్ డీడ్ రిజిస్టరు అయ్యాయి. 2017-18వ సంవత్సరంలో అయోధ్యలో కేవలం 5,962 భూలావాదేవీలు జరిగాయి.

ALSO READ : Telangana Mlc : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు

అంటే భూ విక్రయ లావాదేవీల్లో ఆరు రెట్లు పెరిగాయి. అయోధ్య నగరంలో పర్యాటకం, ఆతిథ్య పరిశ్రమల రంగంలో వేగవంతమైన అభివృద్ధి జరిగింది. అయోధ్యలో హోటల్ పరిశ్రమ భారీగా వృద్ధి చెందుతుందని ఓ హోటల్ యజమాని చెప్పారు. లక్నోలోని హోటల్ లో పనిచేసే తాను టెంపుల్ టౌన్ అయోధ్య హోటల్ మేనేజరుగా వచ్చానని సూర్యత్రిపాఠి చెప్పారు. 32వేల కోట్లరూపాయలతో జాతీయ రహదారులు, గ్రీన్ ఫీల్డ్ టౌన్ షిప్, అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రాల నిర్మాణం సాగుతోంది.

ALSO READ : Gutka Ad Case : ముగ్గురు ప్రముఖ సినీనటులకు కోర్టు నోటీసుల జారీ…ఎందుకంటే…

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అయోధ్య నగరాభివృద్ధికి 264 ప్రాజెక్టులు చేపట్టాయి. పేరెన్నిక గన్న హోటళ్లు సైతం అయోధ్యకు వస్తున్నాయి. రాడిసన్, మారియట్ ఇంటర్నేషనల్ , విందామ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ నిర్మాణానికి ఒప్పందాలు జరిగాయి. మొత్తంమీద రామాలయం నిర్మాణంతో అయోధ్య నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో అయోధ్య చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ బూమ్ ఏర్పడింది.