మోడీతో కలిసి అయోధ్య భూమి పూజలో పాల్గొన్న మహంత్ దాస్‌‍కు కరోనా పాజిటివ్

  • Publish Date - August 13, 2020 / 12:39 PM IST

శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్‌‍కు కరోనా వైరస్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణకు వచ్చింది. ప్రస్తుతం, ఆయన మధురలో ఉన్నాడు. అక్కడే ఆయన ఆరోగ్యం క్షీణించింది.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. మధుర జిల్లా మేజిస్ట్రేట్‌తో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఉత్తమ వైద్యాన్ని అందించడానికి మహాంత్ నృత్య గోపాల్‌కు అన్ని విధాలా సహకరించాలని సిఎం మధుర డిఎంను కోరారు. దీనితో పాటు సిఎం యోగి కూడా మెదంత ఆసుపత్రికి చెందిన డాక్టర్ ట్రెహన్‌తో మాట్లాడి వెంటనే మహంత్ నృత్య గోపాల్ దాస్‌కు వైద్య సదుపాయాలు కల్పించారు. ఆయన ఇటీవల ఆగస్టు 5 న అయోధ్యలో జరిగిన రామ్ ఆలయ భూమి పూజన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా మధురలో, కృష్ణ జన్మదినం సందర్భంగా పూజలు కూడా చేశారు.

మహంత్ నృత్య గోపాల్ దాస్ ఎవరు?
మహంత్ నృత్య గోపాల్ దాస్ శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు. దశాబ్దాలుగా రామ్ ఆలయ ఉద్యమానికి తనవంతు పాత్ర పోషించారు. రామ్ ఆలయ ఉద్యమంలో పెద్ద పాత్ర పోషించిన మరియు కష్టపడిన ప్రధాన సాధువులలో మహంత్ నృత్య గోపాల్ దాస్ ఒకరు. ఆయన చాలా కాలంగా ఆలయ నిర్మాణ పనులలో బిజీగా ఉన్నారు. ఆయన నాయకత్వంలో ఆలయానికి నిధులు బాగా సేకరించబడ్డాయి. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఆయనపై కూడా ఆరోపణలు ఉన్నాయి.