Life in danger: నా జీవితం ప్రమాదంలో ఉందంటూ శ్రీలంక అధ్యక్షుడికి లేఖ రాసిన అత్యాచార నిందితుడు నిత్యానంద

నిత్యానంద రాసిన ఈ లేఖపై శ్రీలంక ప్రభుత్వానికి చెందిన ఒక అధికారి స్పష్టతనిచ్చారు. నిత్యానంద తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు, ఆయనకు అత్యవసర చికిత్స అవసరమైనట్లు ఆయన ధ్రవుపరిచారు. ఈ లేఖను శ్రీలంక అధ్యక్షుడు రాణిల్ విక్రమసింహెకు ఆగస్టులో రాసినట్లు పేర్కొన్నారు. శ్రీకైలాస విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ బాధ్యులు నిత్యాప్రేమాత్మ ఆనంద స్వామి అనే పేరుతో ఈ లేఖ వచ్చిందట.

Nirtyananda

Life in danger: స్వయంప్రకటిత మత గురువు, అత్యాచార నిందితుడు నిత్యానంద ప్రమాదంలో ఉన్నారట. విషమ పరిస్థితిలో ఆయనకు వైద్యం అవసరమున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై శ్రీలంక అధ్యక్షుడికి స్వయంగా నిత్యానంద లేఖ రాయడం.. తనకు ఆశ్రయం కావాలని, వైద్యం చాలా అవసమని సదరు లేఖలో స్వయంగా ఆయనే వేడుకోవడం గమనార్హం. ఈ లేఖను గత నెల 7వ తేదీనే రాసినట్లు తెలుస్తోంది. శ్రీకైలాస పేరుతో చిన్నపాటి ద్వీపంలో సొంతంగా తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసకున్నట్లు ప్రకటించిన నిత్యానంద.. అక్కడ వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని, అందుకే తనకు శ్రీలంకలో ఆశ్రయం కావాలని లేఖలో వేడుకున్నారు.

నిత్యానంద రాసిన ఈ లేఖపై శ్రీలంక ప్రభుత్వానికి చెందిన ఒక అధికారి స్పష్టతనిచ్చారు. నిత్యానంద తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు, ఆయనకు అత్యవసర చికిత్స అవసరమైనట్లు ఆయన ధ్రవుపరిచారు. ఈ లేఖను శ్రీలంక అధ్యక్షుడు రాణిల్ విక్రమసింహెకు ఆగస్టులో రాసినట్లు పేర్కొన్నారు. శ్రీకైలాస విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ బాధ్యులు నిత్యాప్రేమాత్మ ఆనంద స్వామి అనే పేరుతో ఈ లేఖ వచ్చిందట. నిత్యానందకు ఆశ్రయం, వైద్యంపై అధ్యక్షుడికి విదేశాంగ మంత్రిత్వ శాఖ హోదాలో లేఖను పంపినట్లు తెలుస్తోంది.

Fake Baba Raped Three Women : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మ‌హిళ‌ల‌పై న‌కిలీ బాబా పలుమార్లు అత్యాచారం