Fake Baba Raped Three Women : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మ‌హిళ‌ల‌పై న‌కిలీ బాబా పలుమార్లు అత్యాచారం

ఉత్తరప్రదేశ్ లోని గోర‌ఖ్‌పూర్‌లో దారుణం జరిగింది. ముగ్గురు మ‌హిళ‌ల‌పై న‌కిలీ బాబా అఘాయిత్యం చేశాడు. త‌న‌కు తాను స్వామీజీగా చెప్పుకుంటూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మ‌హిళ‌ల‌పై పలుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.

Fake Baba Raped Three Women : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మ‌హిళ‌ల‌పై న‌కిలీ బాబా పలుమార్లు అత్యాచారం

Fake Baba Raped Three Women

Updated On : September 2, 2022 / 8:48 PM IST

Fake Baba Raped Three Women : ఉత్తరప్రదేశ్ లోని గోర‌ఖ్‌పూర్‌లో దారుణం జరిగింది. ముగ్గురు మ‌హిళ‌ల‌పై న‌కిలీ బాబా అఘాయిత్యం చేశాడు. త‌న‌కు తాను స్వామీజీగా చెప్పుకుంటూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మ‌హిళ‌ల‌పై పలుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. పోలీసుల కథనం ప్ర‌కారం కంపీర్‌గంజ్ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో వ‌రుస‌గా ఐదుగురు మ‌ర‌ణించ‌డంతో దిక్కుతోచ‌ని మ‌హిళ‌లు న‌కిలీ బాబా శ్యాం బిహారిని ఆశ్ర‌యించారు.

సదరు మహిళలను రాత్రి వేళ పిలిపించిన న‌కిలీ బాబా వారికి మ‌త్తు మందు ఇచ్చి ప‌లుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. వారి కుటుంబానికి ప‌ట్టిన చీడ‌ను వ‌దిలిస్తాన‌ని వారి నుంచి రూ 60,000 వ‌సూలు చేశాడు.

Crime News: అవివాహితపై నకిలీ స్వామీజీ ఐదేళ్లుగా అత్యాచారం.. భార్యతో వీడియోలు తీయించి బెదిరింపు..

త‌మ ముగ్గురినీ స్వామీజీ లైంగిక వేధింపుల‌కు గురిచేశాడ‌ని తెలుసుకున్న వారు నిందితుడిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు న‌మోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. న‌కిలీ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు.